పారిపోయిన వైకాపా ఎమ్మెల్యే పిన్నెల్లి - లుకౌట్ నోటీసు జారీ

ఠాగూర్
గురువారం, 23 మే 2024 (09:35 IST)
మాచర్ల జిల్లా పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న అధికార వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాష్ట్రం విడిచి పారిపోయాడు. పైగా, ఆయన విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అందుకే పోలీసులు ఆయనకు వ్యతిరేకంగా లుకౌట్ నోటీసు జారీ చేసి అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు. 
 
ఈ ఈవీఎం విధ్వంసం కేసులో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయనను అరెస్టు చేసేందుకు పోలీసులు సిద్ధమై లుకౌట్ నోటీసులు జారీచేశారు. విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నారంటూ అందులో పేర్కొంటూ అన్ని విమనాశ్రయాలను పోలీసులు అప్రమత్తం చేశారు. పైగా, పిన్నెల్లిపై ఐపీసీ 143, 147, 448, 427, 353, 453, 120 బీ, ఆర్పీ యాక్ట్ 131, 135 సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. ఈ కేసులో ఆయన ఇప్టికే ఏ1గా కోర్టులో మెమో దాఖలు చేశారు. 
 
ఈ పరిస్థితుల్లో పిన్నెల్లి అరెస్టు కోసం రంగంలోకి దిగిన ఏపీ పోలీసులు హైదరాబాద్‌లో ఉన్నట్టు సమాచారం రావడంతో తెలంగాణా పోలీసులతో కలిసి గాలిస్తున్నారు. సంగారెడ్డి జిల్లా కందిరిలో పిన్నెల్లి కారును గుర్తించారు. అయితే, కారులో ఆయన కనిపించలేదు. కానీ పిన్నెల్లి కారు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తొలుత పిన్నెల్లి అరెస్టు అంటూ వార్తలు వచ్చినప్పటికీ ఆ తర్వాత ఆయన డ్రైవర్‌ను అరెస్టు చేసినట్టు పోలీసులు ప్రకటించారు. ఆ తర్వాత పిన్నెల్లి కోసం ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేయడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జబర్దస్త్ నుంచి అందుకే వచ్చేశాను.. రష్మీ-సుధీర్ లవ్ ట్రాక్ గురించి చమ్మక్ చంద్ర ఏమన్నారు?

Vaishnavi: పురుష: నుంచి హీరోయిన్ వైష్ణవి పాత్ర ఫస్ట్ లుక్

ఛాంపియన్ కథ విన్నప్పుడు ఎమోషనల్ గా అనిపించింది : అనస్వర రాజన్

Jin: జిన్ లాంటి కొత్త ప్రయోగాన్ని అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నా : నిఖిల్ ఎం. గౌడ

SS Rajamouli: ఎస్‌ఎస్ రాజమౌళి పై జేమ్స్ కామెరాన్ కామెంట్ వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే మిక్స్‌డ్ డ్రై ఫ్రూట్స్ తింటే?

దేశ తొలి మిస్ ఇండియా మెహర్ ఇకలేరు...

ఊబకాయం, టైప్ 2 డయాబెటిస్ చికిత్స కోసం సిప్లా యుర్పీక్ ప్రారంభం

గాజువాక ప్రభుత్వ పాఠశాలలో నాట్స్ సాయంతో గ్రీన్ స్టూడియో

ధ్యానంలోకి మరింత లోతుగా ఎలా వెళ్లాలి?: గురుదేవ్ శ్రీ శ్రీ రవి శంకర్

తర్వాతి కథనం
Show comments