Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేనానికి షాకిచ్చిన జనసేన ఎమ్మెల్యే రాపాక

Webdunia
సోమవారం, 20 డిశెంబరు 2021 (19:32 IST)
సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు కార్యకర్తలకు ఆ పార్టీ తిరుగుబాటు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు మరోమారు తేరుకోలేని షాకిచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనకు ఆయన సంపూర్ణ మద్దతు తెలిపారు. ప్రశంసల వర్షం కురిపించారు. 
 
సీఎం జగన్ పుట్టినరోజును పురస్కరించుకుని ఎమ్మెల్యే రాపాక సొంత నియోజకవర్గంలో వైకాపా శ్రేణులు రక్తదాన శిబిరాన్ని సోమవారం ఏర్పాటుచేశాయి. ఇందులో జనసేన రెబెల్ ఎమ్మెల్యే రాపాక పాల్గొని తన సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సీఎం జగన్ పాలనను మెచ్చుకున్నారు. దీంతో ఆయన మరోమారు వార్తల్లో నిలిచారు. 
 
వైకాపా కార్యకర్తలు నిర్వహించిన ఈ రక్తదాన శిబిరం విజయవంతమయ్యేందుకు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు అనుచరులు కూడా సహకరించారు. ఈ సందర్భంగా రాపాక మాట్లాడుతూ, సీఎం జగన్ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను కొనియాడుతూ ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాక్షించారు. 

సంబంధిత వార్తలు

కేసీఆర్‌ లాంచ్ చేసిన కేసీఆర్‌ సినిమాలోని తెలంగాణ తేజం పాట

శ్రీవారిని దర్శించుకున్న డింపుల్ హయాతీ.. బాబోయ్ కాళ్ళు కాలిపోతున్నాయి..

అనుష్క తరహా పాత్రలు. యాక్షన్ , మార్షల్ ఆర్ట్స్ రోల్స్ చేయాలనుంది : కృతి శెట్టి

తన తండ్రి 81 వ జయంతి సందర్బంగా గుర్తుచేసుకున్న మహేష్ బాబు

ఫోన్ ట్యాపింగ్ వల్లనే సమంత కాపురం కూలిపోయింది: బూర సంచలన వ్యాఖ్యలు

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

జెన్ జెడ్ ఫ్యాషన్-టెక్ బ్రాండ్ న్యూమీ: హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్‌లో అతిపెద్ద రిటైల్ స్టోర్‌ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments