Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంతలోనే అంత అప్పా? .. బుగ్గనపై లోకేష్ ఆగ్రహం

Webdunia
గురువారం, 11 జులై 2019 (08:06 IST)
టీడీపీ ప్రభుత్వం రాష్ర్రాన్ని అప్పులపాలు చేసిపోయిందంటూ ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన విడుదల చేసిన శ్వేతపత్రం పై మాజీ మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వం తీరుపై ట్విట్టర్ లో విరుచుకుపడ్డారు.

"ఆర్థికమంత్రిగారూ! మీరు శ్వేతపత్రాలు అన్నప్పుడే సాక్షి కథనాల్లా స్పష్టత లేకుండా, ఆధారాలు లేకుండా ఉంటాయని మేము ఊహించాం. వృద్ధి కాగితాల మీద కనిపించింది కానీ ఫీల్డులో కనిపించడం లేదు అన్నారు. అంటే మీ శ్వేతపత్రంలో ఉంది కానీ మీరు ఒప్పుకోనంటారు అంతేగా? 
 
మత్స్యశాఖ, పశుసంవర్థక శాఖల అభివృద్ధిని వ్యవసాయశాఖ అభివృద్ధిలో ఎలా చూపిస్తారని అడిగారు. ముందుగా ఆ శాఖల అభివృద్ధిని మీరు ఒప్పుకున్నందుకు కృతజ్ఞతలు. అయితే వ్యవసాయ, పశుసంవర్థక, మత్స్యశాఖలను కలిపే జీఎస్ డిపిని లెక్కించడం దేశమంతా ఉంది. మీకది కొత్త విషయం అంతే. 
 
2018-19 నాటి బడ్జెట్ ప్రకారం రాష్ట్ర అప్పు రూ. 2 లక్షల 49 వేల కోట్లు. కేంద్ర ఆర్థిక మంత్రి కూడా వారం క్రితం పార్లమెంటులో ఇదే చెప్పారు. మీరేమో 3 లక్షల 62 వేల కోట్లని అన్నారు. ఒకేసారి లక్ష 13 వేల కోట్ల అప్పు ఎలా పెరిగింది? ఈ 45 రోజుల్లో మీ ప్రభుత్వమేమైనా చేసిందా? 
 
అప్పు ఎక్కువ చూపించి మీరేం చెప్పదలచుకున్నారు? రాష్ట్ర పరిస్థితి తెలియకుండానే మీరు అన్ని హామీలు చేశారా? వాటిని నెరవేర్చకుండా  తప్పించుకోడానికి ఇప్పుడు అప్పుల బూచిని బూతద్దంలో చూపిస్తే కుదరదు. చాతకాదంటే ప్రజల ముందు ఒప్పుకోండి"  అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Naga Chaitanya: తొలి ముద్దు సమంతకు, శోభితకు కాదు.. ఎవరికో తెలుసా?

ఏయ్, నా నడుము మీద చెయ్యి ఎందుకేశావ్? నీ టాపు లేచిపోతుందనీ: నటితో నిర్మాత వెకిలి చేష్టలు

Pawan Kalyan: ముంబై వీధుల్లో గ్యాంగ్‌స్టర్ లుక్‌లో పవన్ - వీడియో వైరల్

సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రాబోతోన్న మార్గన్ : విజయ్ ఆంటోని

సనాతన ధర్మం గొప్పతనాన్ని చాటిచెప్పేలా హరి హర వీరమల్లు : జ్యోతి కృష్ణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

చెడు కొలెస్ట్రాల్, తగ్గించుకునేదెలా?

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

తర్వాతి కథనం
Show comments