Webdunia - Bharat's app for daily news and videos

Install App

5 నెలల క్రితం రూ.14.5 కోట్లు.. ఇపుడు రూ.330 కోట్లు.. ఇదీ నారా లోకేష్ సంపద!

నారా లోకేష్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకైక తనయుడు. నేడో రేపో ఎమ్మెల్సీగా ఎన్నిక కానున్నారు. అయితే, ఈయనగారి ఆస్తి కేవలం ఆరు నెలల కాలంలో రూ.14.5 కోట్ల

Webdunia
గురువారం, 9 మార్చి 2017 (17:24 IST)
నారా లోకేష్. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏకైక తనయుడు. నేడో రేపో ఎమ్మెల్సీగా ఎన్నిక కానున్నారు. అయితే, ఈయనగారి ఆస్తి కేవలం ఐదు నెలల కాలంలో రూ.14.5 కోట్ల రూ.330 కోట్లకు పెరిగిందట. ఈ విషయంపై జాతీయ మీడియా ఎన్డీటీవీ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. 
 
గత యేడాది అక్టోబరు నెల 19వ తేదీన లోకేష్ ప్రకటించిన ఆస్తుల వివరాల్లో తమ కుటుంబ సంస్థ హెరిటేజ్ ఫ్రెష్‌లో‌ని షేర్లు, కొన్ని స్థిరాస్తులు, రూ.95 లక్షల విలువ చేసే ఓ కారును పేర్కొన్నారని తెలిపింది. తమ ఆస్తులను ప్రజలకు పారదర్శకంగా వెల్లడించాలనుకున్న క్రమంలోనే ఈ వివరాలను తెలుపుతున్నట్టు లోకేష్ చెప్పారని పేర్కొంది.
 
అయితే, ఇపుడు ఎమ్మెల్సీ నామినేషన్ సందర్భంగా అంటే 2017 మార్చి 7వ తేదీ ఈసీకి సమర్పించిన అఫిడవిట్లో రూ.‌330 కోట్ల సంపద ఉన్నట్టు లోకేష్ పేర్కొన్నారని ప్రచురించింది. ఇందులో షేర్ల రూపంలోనే రూ.274 కోట్లు ఉందని చెప్పినట్టు తెలిపింది. అయితే తన ఆస్తుల వివరాలను స్వచ్ఛందంగా ప్రకటించినప్పుడు 'బుక్ వాల్యూ'ని పరిగణనలోకి తీసుకున్న లోకేష్... ఎన్నికల సంఘానికి ఇచ్చిన సమాచారంలో 'మార్కెట్ వాల్యూ'ని పరిగణనలోకి తీసుకున్నారని చెప్పింది. కేవలం ఆరు నెలల్లో నారా లోకేష్ ఆస్తులు ఇంత భారీ స్థాయిలో ఎలా పెరిగాయన్నదానిపై విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments