Webdunia - Bharat's app for daily news and videos

Install App

కుప్పంలో చంద్రబాబుకు స్థానికంగా రాజకీయంగా ఎదురుదెబ్బ‌

Webdunia
సోమవారం, 20 సెప్టెంబరు 2021 (11:27 IST)
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత నారా చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో స్థానిక ఎన్నిక‌ల‌ల‌లో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. ఇక్క‌డి నాలుగు మండలాల్లోనూ వైయస్సార్‌సీపీ ఘన విజయం సాధించింది. కుప్పం మండలంలో 19 ఎంపీటీసీలకు వైయస్సార్‌సీపీకి 17, టీడీపీకి 2 స్థానాలు ల‌భించాయి. గుడిపల్లె మండలంలో లో 12 ఎంపీటీసీల్లో అన్ని చోట్లా  వైయస్సార్‌సీపీ గెలిచింది.
 
రామకుప్పం మండలంలో 16 ఎంపీటీసీలకు అన్నిచోట్లా వైయస్సార్‌సీపీయే విజ‌యం సాధించింది. శాంతిపురం మండలంలో 18 ఎంపీటీసీలకు 11 చోట్ల వైయస్సార్‌సీపీ, 1 చోట టీడీపీ గెలుపు. మరో 6 చోట్ల ఫ‌లితాలు రావాల్సిం ఉంది. 
 
ఇదే బాటలో జడ్పీటీసీల ఫలితాలు కూడా టీడీపీకి వ్య‌తిరేకంగా ఉన్నాయి. చంద్రబాబు స్వగ్రామం నారావారిపల్లె ఎంపీటీసీలోనూ టీడీపీ దారుణ ఓటమి పాలైంది. వైయస్సార్‌సీపీ అభ్యర్థి రాజయ్య వేయి ఓట్లకుపైగా మెజార్టీతో గెలుపొందారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో  జరిగిన పంచాయతీ ఎన్నికల్లో చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో టీడీపీ ఘోర పరాజయం పాల‌య్యారు. నాలుగు మండలాల్లో 89 పంచాయతీల్లో 75 చోట్ల వైయస్సార్‌సీపీ, 14 చోట్ల టీడీపీ గెలుపు ల‌భించింది. కుప్పం నియోజకవర్గంలో 85శాతానికిపైగా పంచాయతీల్లో వైయస్సార్‌సీపీ ప్రభంజనం కొన‌సాగింది.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments