Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంత్రిగారూ... లీకేజీ చిన్నదే కానీ ప్యాకేజీ ఎంతో చెప్పండి... ఆళ్ల

అమరావతి రాజధాని సచివాలయంలోని మంత్రి గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వర రావు ఛాంబర్లకు లీకేజీలు కావడంపై వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచితంగా భూమి, ఇసుక ఇచ్చి చదరపు అడుగు నిర్మాణానికి రూ. 10,000 చెల్లించి మొత్తం 100

Webdunia
మంగళవారం, 18 జులై 2017 (14:23 IST)
అమరావతి రాజధాని సచివాలయంలోని మంత్రి గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వర రావు ఛాంబర్లకు లీకేజీలు కావడంపై వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉచితంగా భూమి, ఇసుక ఇచ్చి చదరపు అడుగు నిర్మాణానికి రూ. 10,000 చెల్లించి మొత్తం 1000 కోట్లు చెల్లించి నిర్మాణాలు చేపడితే ఒక్క వర్షానికే లీకులా అంటూ ఆయన ప్రశ్నించారు. 
 
మంత్రి నారాయణ ఇదేదో చిన్న విషయమనీ, దాన్ని భూతద్దంలో పెట్టి చూడవద్దనడం సహేతుకంగా లేదన్నారు. లీకేజీ చిన్న విషయమైనా మీకు అందిన ప్యాకేజీ ఎంతో చెప్పాలన్నారు. అమరావతి సచివాలయంలో ఇంతకుముందు ప్రతిపక్ష నాయకుడు జగన్ మోహన్ రెడ్డి చాంబరులోకి నీళ్లు వచ్చినప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదనీ, ఇప్పుడు ఏకంగా మంత్రుల చాంబర్లకే చిల్లులు పడి నీళ్లు కారుతుంటే మంత్రిగారికి అది చిన్న విషయం అనిపిస్తుందనీ, అమరావతి సచివాలయంలో జరిగిన అవినీతిని సీఐడితో కాదు సీబీఐతో విచారణ చేయించాలని ఆళ్ల డిమాండ్ చేశారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments