Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకివే చివరి ఎన్నికలు, 2029లో పోటీ చేయను: కొడాలి నాని షాకింగ్ కామెంట్

ఐవీఆర్
శుక్రవారం, 8 మార్చి 2024 (11:30 IST)
మాజీమంత్రి కొడాలి నాని తనకు ఈ ఎన్నికలు చివరివి అని సంచలన వ్యాఖ్యలు చేసారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలు 2029లో తను పోటీ చేయబోనని స్పష్టం చేసారు. ఆయన మాట్లాడుతూ... నాకు 53 ఏళ్లు వచ్చేసాయి. 2029 నాటికి 58 ఏళ్లు వస్తాయి. ప్రభుత్వ లెక్కల ప్రకారం అది రిటైర్మెంట్ ఏజ్. కనుక ఆ తర్వాత నేను రాజకీయాల్లో కొనసాగదలచుకోలేదు. అలాగే నా కుమార్తెలకు రాజకీయాలపై అసలు ఆసక్తి లేదు. నా సోదరుడు కుమారుడికి ఆసక్తి వుంటే అతడు పోటీ చేస్తాడేమో నాకు తెలియదు అంటూ చెప్పుకొచ్చారు.
 
నన్ను చూసి షాక్ అవుతున్నావా అన్నా?
తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష భారత రాష్ట్ర సమితికి భారీ షాక్ తగలనుంది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, తన అల్లుడు, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌ రెడ్డితో సహా కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. గురువారం ఉదయం ఆరు గంటలకు.. రాజశేఖర్‌ రెడ్డి కళాశాలలో అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభం కావడంతో మల్లారెడ్డి అప్రమత్తమయ్యారు. ఉదయం 7 గంటల సమయంలో కుమారుడు మహేందర్‌ రెడ్డి, అల్లుడు రాజశేఖర్‌ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నేత మంద సంజీవరెడ్డితో కలిసి హుటాహుటిన బయల్దేరి ముఖ్యమంత్రి సలహాదారుడు వేం నరేందర్‌ రెడ్డి ఇంటికి వెళ్లారు. 
 
మల్లారెడ్డిని చూసి ఆయన షాక్‌కు గురవడంతో.. 'నన్ను చూసి షాక్‌కు గురవుతున్నావా అన్నా?' అంటూ పలకరించారు. తన ఇంటి అడ్రస్‌ ఎలా తెలుసని ఆయన అడగ్గా.. 'తెలంగాణలో నీ ఇల్లు తెలియనివారు ఉన్నారా?' అంటూ మల్లారెడ్డి చమత్కారంగా మాట్లాడారు. అనంతరం.. తన అల్లుడి కాలేజీలో జరుగుతున్న కూల్చివేతలపై మాట్లాడారు. 'ఎలాగైనా నిలిపివేయించన్నా' అంటూ మల్లారెడ్డి ప్రాధేయపడినట్లు తెలిసింది. అయితే, ఈ విషయంలో తానేమీ చేయలేనని.. మేడ్చల్‌ రాజకీయాల్లో తలదూర్చలేనని వేం నరేందర్‌ రెడ్డి తెలపడంతో.. కనీసం సీఎం అపాయింట్‌మెంట్‌ ఇప్పించాలని కోరినట్టు తెలిసింది.
 
''మీరు హామీ ఇస్తే లక్షమందితో పార్టీలో చేరుతా'' అని మల్లారెడ్డి చెప్పినట్టు సమాచారం. దాదాపు 3 గంటలపాటు సాగిన వారి భేటీలో పలు అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ తరపున తన కుమారుడికి మల్కాజిగిరి ఎంపీ టికెట్‌ ఇప్పించుకునేందుకు కూడా మల్లారెడ్డి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే, మల్లారెడ్డి వర్గీయులు మాత్రం కూల్చివేతలపైనే ఆయన మాట్లాడారని, రాజకీయ అంశాలేవీ ప్రస్తావనకు రాలేదని చెబుతున్నారు. దీనిపై మల్లారెడ్డిని సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జూనియర్ ఎన్టీఆర్ "దేవర" చిత్రం ఎలా ఉంది.. ట్విట్టర్ రివ్యూ ఏంటి?

ఫ్యాన్స్ కు పండగలా దేవర వుందా? చివరి 40 నిముషాలు హైలైట్ గా దేవర - ఓవర్ సీస్ రివ్యూ

రోటి కపడా రొమాన్స్‌ విజయం గురించి డౌట్‌ లేదు, అందుకే వాయిదా వేస్తున్నాం

కోర్టు సీన్ తో గుమ్మడికాయ కొట్టిన తల్లి మనసు షూటింగ్

ఫ్యాన్స్ జేబులను లూఠీ చేస్తున్న మూవీ టిక్కెట్ మాఫియా!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

నల్ల జీలకర్ర నీటిని మహిళలు పరగడుపున తాగితే?

పాలలో తేనె వేసుకుని తాగితే ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments