Webdunia - Bharat's app for daily news and videos

Install App

నీ లాభం నీకు కావాలా...? ఐతే తీస్కో అంటూ మద్యం సీసాతో పొడిచేశారు...

Webdunia
బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (10:28 IST)
పాత కక్షలతో రగిలిపోతున్న ముగ్గురు ఒక రియల్టర్‌‌ను మద్యం మత్తులో బీర్ సీసాలు, రైస్ కుక్కర్‌తో తలపై మోది దారుణంగా హత్య చేసారు. శవాన్ని ఏమి చేయాలో తోచక దుప్పట్లో చుట్టి గదిలో మూల పడేశారు. గదిలో నుండి దుర్వాసనలు వస్తుండటంతో స్థానికులు ఈ నెల మూడవ తేదీన బాలాపూర్ ఎస్సై‌కి సమాచారం అందించారు. ఈ విషయంగా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేసారు. 
 
బాలాపూర్‌ ఇన్‌స్పెక్టర్‌ సైదులు కథనం ప్రకారం, పాతబస్తీ బార్కాస్‌ సలాలలో ఉండే హుసేన్‌బిన్‌ అహ్మద్‌ సాది(24) రియల్ ఎస్టేట్ వ్యాపారి. సంవత్సరం క్రితం హిజ్రాలపై స్థానికులు చేసిన దాడిలో ఒకరు మృతి చెందగా, ఆ కేసులో ఇతను ఐదవ నిందితుడుగా ఉన్నాడు. స్థానికంగా ఉండే ముబారక్‌ వహిలాన్‌ అలియాస్‌ చంద్‌ వహిలాన్‌(34), జల్‌పల్లి అలినగర్‌లో ఉండే ఇఫ్తెకార్‌ అలి(42), బిస్మిల్లా కాలనీ వాసి అజీజ్‌(21)తో భూ వివాదాల కారణంగా ఇతనికి పాత కక్షలు ఉన్నాయి. 
 
ఇటీవల విక్రయించిన ఓ ప్లాటుకి సంబంధించి హుసేన్‌బిన్‌ లక్ష రూపాయల మేరకు మోసం చేసాడని వారు ముగ్గురూ కోపంతో ఉన్నారు. అయితే ఎప్పటిలాగానే బాలాపూర్‌ ఠాణా పరిధిలో అలినగర్‌లోని ఇఫ్తెకార్‌ అలి ఇంట్లో సదరు నలుగురు ఈనెల 2న రాత్రి మద్యం తాగారు. డబ్బు విషయంగా ఆ ముగ్గురూ హుసేన్‌బిన్‌‌ని ప్రశ్నించారు. అది తనకు వచ్చిన లాభం అని దానితో వారికి సంబంధం లేదని మొండికేశాడు. 
 
కోపోద్రిక్తులైన వారు మత్తులో తలపై సీసాలతో, రైస్ కుక్కర్‌తో బాది చంపేశారు. శవాన్ని దుప్పట్లో చుట్టి మూల పడేశారు. పోలీసులు మృత దేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. కాగా నిందితులు పరారీలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan: నేను సక్సెస్ లో కాదు ఫ్లాప్ లో పెరిగా, ఈ గుండె మీకోసం కొట్టుకుంటుంది : పవన్ కళ్యాణ్

Samantha: శుభంలో చిన్న రోలే.. కానీ నందిని రెడ్డి డైరక్షన్‌లో సమంత నటిస్తుందా?

Atharva: మై బేబీ సినిమా రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది

Varun tej: వరుణ్ తేజ్ 15వ చిత్రానికి థమన్ మ్యూజిక్ సిట్టింగ్

పెద్ద హీరోలతో నో యూజ్... చిన్న హీరోలతో నటిస్తేనే మంచి పేరు : నిత్యా మీనన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

తర్వాతి కథనం
Show comments