Webdunia - Bharat's app for daily news and videos

Install App

నందమూరి పౌరుషం అంటే జూ.ఎన్టీఆర్‌దే... ఆ పిచ్చివాడికి ఎమ్మెల్యే... బాలయ్యపై లక్ష్మీపార్వతి

Webdunia
గురువారం, 27 డిశెంబరు 2018 (17:29 IST)
స్వర్గీయ ఎన్టీఆర్ సతీమణి, వైసీపి నాయకురాలు లక్ష్మీపార్వతి జూనియర్ ఎన్టీఆర్‌ను ఒకవైపు పొగడుతూ మరోవైపు బాలయ్యపై సంచలన కామెంట్లు చేశారు. ఇంతకీ ఆమె ఏమన్నారంటే... ఆనాడు లక్ష్మీ పార్వతిని బూచిగా చూపించి పార్టీని చంద్రబాబు నాయుడు ఆక్రమించేశారు. నందమూరి హరికృష్ణకు ఎమ్మెల్యే కాక ముందు మంత్రి పదవి ఇచ్చారు. ఆ తర్వాత కరివేపాకులా తీసిపడేశారు. 
 
ఆ వ్యవహారంపై హరికృష్ణ ఎంతో బాధపడ్డారు. మహానాడులో ఎన్టీఆర్ కొడుకుల ఫోటోలు లేవు. అన్నీ నారావారి ఫోటోలే. అది చూసి హరికృష్ణ స్టేజి పైనుంచి దిగి వచ్చేశారు. ఇలా ప్రతిసారి ఎన్టీఆర్ కుటుంబాన్ని కరివేపాకులా తీసేస్తూ వచ్చిన బాబు మొన్న తెలంగాణ ఎన్నికల్లో ఎన్టీఆర్ మనవరాలు సుహాసిని అమాయకురాలిని చేసి తీసుకొచ్చాడు. ఆమె ఓడిపోతుందని తెలిసినా బలిపశువు చేశారు.
 
బాలయ్య కూతురుని కొడుక్కు చేసుకుని అతడిని కట్టిపడేశావు. ఆ పిచ్చివాడికి ఏదో ఎమ్మెల్యే కట్టబెట్టావు. ఆయన ఎమ్మెల్యే ఒకవైపు సినిమాలు చేసుకుంటూ ఇంకోవైపు చేసుకుంటూ గెంతుకుంటూ వెళుతున్నాడు. దేశంలో మంచి పాపులారిటీ వున్న వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్. అతడిని పక్కన పెట్టేసి కొడుకు నారా లోకేష్‌ను తీసుకొచ్చారు. జూ.ఎన్టీఆర్‌ను పార్టీలోకి తీసుకుంటే ఎక్కడ లోకేష్ బాబు వెనకబడిపోతాడోనని పక్కనపెట్టేశారు.
 
నందమూరి రాజకీయ ఆస్తిని నారా ఫ్యామిలీ వాడుకుంటున్నారు. మొన్న సుహాసిన కూకట్ పల్లి ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ప్రచారానికి వెళ్లలేదు. ఎందుకంటే మళ్లీ నందమూరి ఫ్యామిలీని కరివేపాకులా వాడుకోవాలని చూశారని ఆయన కనిపెట్టేశారు. అందుకే వెళ్లలేదు. అదీ నందమూరి పౌరుషం అంటే. జూనియర్ ఎన్టీఆర్‌కు ఆ పౌరుషం వుందంటూ లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఓ హీరో ఇబ్బందికరంగా ప్రవర్తించారు.. : సినీ నటి ఖుష్బూ

డిసెంబర్ నుంచి స్ట్రీమింగ్ కానున్న హరికథ వెబ్ సిరీస్

ఖర్చుపెట్టినా దక్కని ఫలితంతో ఎస్కేప్ అయిన నిర్మాత

ఎస్ఎస్ థమన్ లాంచ్ చేసిన అల్లరి నరేష్, అమృత అయ్యర్ బచ్చల మల్లి మెలోడీ సాంగ్

కన్నప్ప లో మహాదేవ శాస్త్రిగా మోహన్ బాబు లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

క్యాబేజీతో బిర్యానీ.. పెరుగు పచ్చడితో టేస్ట్ చేస్తే.. అదిరిపోతుంది...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

తర్వాతి కథనం
Show comments