Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ ఇద్దరినీ వేధించింది ఒక్కరే....

Webdunia
బుధవారం, 15 మే 2019 (18:27 IST)
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు లక్ష్మీ పార్వతి, సినీ నటి పూనంకౌర్‌లు సోషల్ మీడియాలో తమను వేధింపులకు గురి చేస్తున్నారని గతంలో వారిద్దరూ వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఆ ఇద్దరు ప్రముఖుల్ని సోషల్ మీడియాలో వేధించింది ఒక్కడే అన్న విషయాన్ని సైబరాబాద్ పోలీసులు గుర్తించారు.
 
కొందరు వ్యక్తులు తమ ప్రతిష్టను దెబ్బ తీసేలా ఫేస్‌బుక్, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా అశ్లీల కథనాలు, అసభ్య రాతలతో పోస్ట్ చేస్తున్నారని వారు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇరువురిని వేధింపులకు గురి చేసింది ఒక్కరేనన్న విషయాన్ని గుర్తించారు. నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడని, ఈ పనిలో మరో వ్యక్తి కూడా పాలుపంచుకున్నాడని పోలీసులు వెల్లడించారు. 
 
హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఒక అపార్ట్‌‌మెంట్‌లో వారిద్దరూ ఒక ఆఫీసును నిర్వహిస్తున్నారని తేలింది. వారిద్దరినీ అరెస్ట్ చేసేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో అసభ్యరాతలు రాయడానికి కారణం నిందితులను పట్టుకుంటే గానీ తెలియదని చెప్పారు. డబ్బు కోసం చేసారా లేక వ్యక్తిగత కక్షతో ఇలాంటి పని చేసారా అనేది తేలాల్సి ఉందని చెప్పారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లెగ్దా డిజైన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఆవిష్కరించిన హీరోయిన్ అనన్య నాగళ్ల

Prabhas: ప్రభాస్ తో మారుతీ ప్రేమకథాచిత్రం రీమేక్ చేస్తున్నాడా?

Bigg Boss Telugu 9: బిగ్ బాస్ హోస్టుగా నాగార్జునే ఫిక్స్..?

NTR: ఎన్టీఆర్ కు ప్రముఖులు శుభాకాంక్షలు - వార్ 2 లో ఎన్టీఆర్ పై సాంగ్

ఒక అద్భుతమైన సినిమా చూశా.. ఎవరూ మిస్ కావొద్దు : ఎస్ఎస్ రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments