Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుసకు తమ్ముడే.. ఆస్పత్రికి వెళ్తుంటే.. పొదల్లోకి తీసుకెళ్లి మహిళపై..?

Webdunia
గురువారం, 26 మార్చి 2020 (12:01 IST)
మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. అయితే ఎన్ని కఠిన చట్టాలు చేసినా దేశంలో మహిళలపై అత్యాచారాలు ఆగడంలేదు. కరోనా వైరస్ భయంలో దేశమంగా లాక్‌డౌన్ అయినా కూడా కామాంధులు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ వివాహితపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా ఆత్మకూరు మండలంలోని నాగలూటి చెంచుగూడెంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 
 
గత కొద్ది రోజులుగా భర్తకు అనారోగ్యం ఉండటంతో బాధిత మహిళ స్థానిక ఆస్పత్రిలో చూపించింది. మంగళవారం మరోసారి పరిస్థితి విషమించడంతో ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సదరు మహిళ ఆటో కోసం బయటకు వచ్చింది. అయితే అప్పటికే ఆమెపై కన్నేసిన అదే గూడెంకు చెందిన గుర్రప్ప అనే యువకుడు ఆటో తాను చూపిస్తానని నమ్మించాడు. 
 
ఇక వరుసకు తమ్ముడే కావడంతో ఆమె అతడి మాటలు నమ్మి అతడి బైక్‌పై వెళ్లింది. కానీ దారిలోనే బైకు ఆపి గుర్రప్ప ఆమెను తన కోరిక తీర్చాలని కోరాడు. కానీ అందుకు ఆమె నిరాకరించింది. దీంతో గుర్రప్ప ఆమెను పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఇక బాధితురాలు ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఇంటికి చేరుకుంది.
 
అయితే బుధవారం ఆమె భర్త పరిస్థితి విషమంగా మారడంతో 108కు సమాచారమిచ్చింది. మరోవైపు బాధితురాలికి కూడా ఆరోగ్యం బాగోలేదని గుర్తించిన సిబ్బంది ఆమెను ప్రశ్నించగా.. ఆ రోజు జరిగిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో 108 సిబ్బంది దంపతులను ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇక ఆ తర్వాత బాధితురాలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments