kurnool bus accident: 120 కిమీ వేగంతో బస్సు, ఎదురుగా దూసుకొచ్చిన తాగుబోతు బైకర్ ఢీకొట్టాడు

ఐవీఆర్
శుక్రవారం, 24 అక్టోబరు 2025 (20:02 IST)
కర్నూలు బస్సు ప్రమాదానికి గల కారణం వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో బైకు నడుపుతో రాంగ్ రూట్లో... అంటే వన్ వేకి ఎదురుగా బైకర్ రావడంతోనే ఈ ఘోర ప్రమాదం జరిగినట్లు చెపుతున్నారు. కర్నూలు మండలం ప్రజానగర్‌కు చెందిన 20 ఏళ్ల శంకర్ జాతీయ రహదారి 44 మీద కర్నూలు పట్టణ సమీపంలో రాంగ్ రూట్లో వచ్చాడు. ఇతడు గత రెండ్రోజుల క్రితం తన పెళ్లి విషయమై గొడవపడి ఇంటికి వెళ్లకుండా మద్యం సేవిస్తూ బైక్ పైన తిరుగుతున్నట్లు తెలిసింది.
 
ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారు జామున అతడు రాంగ్ రూట్లో 120 కిలోమీటర్ల వేగంతో రహదారిపై వస్తున్న బస్సుకి ఎదురుగా వచ్చేసాడు. అకస్మాత్తుగా అతడు ఎదురుగా రావడంతో డ్రైవరు బ్రేకులు వేసే సాహసం చేయలేకపోయాడు. బైకుపైకి అలాగే పోనిచ్చేసాడు. ఐతే ఈ ప్రమాదంలో అతడి మృతి చెందడంతో పాటు అతడి వాహనం ట్యాంక్ రోడ్డుకి తగిలి మంటలు చెలరేగి క్షణాల్లో బస్సు దగ్ధమైంది.
 
ప్రయాణికులు తేరుకునేలోపుగానే ఘోరం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో 21 మంది సజీవ దహనమయ్యారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో అటు బైకర్ నిర్లక్ష్యంతో పాటు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కూడా వుండటంతో దారుణం జరిగిపోయింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akanda 2: ఏ సౌండ్ కు నవ్వుతానో.. నరుకుతానో నాకే తెలియదు అంటున్న బాలక్రిష్ణ

చెవిటి, మూగ అమ్మాయి ని ప్రేమించే యువకుడి గాథతో మోగ్లీ

Ram Charan : పెద్ది షూటింగ్ కోసం శ్రీలంకకు బయలుదేరిన రామ్ చరణ్

Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఆహ్వానించిన నారా రోహిత్

Heba Patel: పోస్ట్ ప్రొడక్షన్ ల్లో అనిరుధ్, హెబా పటేల్ మారియో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మిస్సోరీలో దిగ్విజయంగా నాట్స్ వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

తర్వాతి కథనం
Show comments