Webdunia - Bharat's app for daily news and videos

Install App

టమాటా నారు నాటుతున్న మహిళకు చిక్కిన వజ్రం...

Webdunia
సోమవారం, 28 జూన్ 2021 (09:50 IST)
రాయలసీమ ప్రాంతంలో తొలకరి జల్లుల సమయంలో ఆకాశం నుంచి వజ్రాలు పడుతుంటాయి. దీంతో పొలాల్లో వజ్రాల వేట ముమ్మరంగా సాగుతుంది. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలోని పొలాల్లో వజ్రాల వేట కొన్ని రోజులుగా కొనసాగుతోంది. 
 
వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇక్కడి పొలాలు జాతరను తలపిస్తాయి. స్థానికులే కాకుండా చుట్టుపక్కల జిల్లాల ప్రజలు కూడా వచ్చి ఇక్కడ వజ్రాల వేటలో మునిగి తేలుతుంటారు. జిల్లాలోని జొన్నగిరిలో ఆదివారం ఓ మహిళా కూలీకి ఖరీదైన వజ్రం లభించింది.
 
టమాటా నారు నాటుతున్న కూలీ చేతికి చిక్కిన ఈ వజ్రాన్ని అదే గ్రామానికి చెందిన ఓ వ్యాపారి రూ.6 లక్షలకు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. జొన్నగిరిలో ఇటీవల ఓ రైతుకు దొరికిన వజ్రం రూ.1.25 కోట్లకు అమ్ముడుపోయిన విషయంతెల్సిందే. 
 
కాగా, జిల్లాలోని జొన్నగిరి, పగిడిరాయి, జి.ఎర్రగుడి, పెరవలి ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతుంటాయి. గతంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఇక్కడ తవ్వకాలు జరిపేవారు. ఇప్పుడు స్థానికులే ఆ పని చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వరుస ఫ్లాప్‌లు... అయినా ఛాన్సులు.. 'డ్యాన్సింగ్ క్వీన్‌' సీక్రెట్ ఏంటోమరి?

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments