Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్, కేటీఆర్ కలయిక... సీఎం రమేష్ విన్నపం

Webdunia
గురువారం, 27 ఆగస్టు 2015 (08:00 IST)
వారి విషయంలో పార్టీల నాయకులందరూ సానుకూలంగానే వ్యవహరించారు. భేషజాలను పక్కన పెట్టి తెలుగుదేశం నేత సీఎం రమేష్, వైసీపీ నేత జగన్‌ను విన్నవించడం... ఆయన తెలంగాణ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడడం అన్నీ జరిగిపోయాయి. విద్యుత్ ఉద్యోగుల విషయంలో జరిగిన సంఘటనలో ఫలితం ఏమొచ్చింది.?  వివరాలిలా ఉన్నాయి. 
 
సీమాంధ్ర మూలాల పేరిట తెలంగాణ సర్కారు 1250 విద్యుత్‌ ఉద్యోగులను రిలీవ్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో అత్యంత కీలక పరిణామాలు చోటు చేసుకున్నట్లు సమాచారం. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ను విద్యుత్‌ ఉద్యోగులు కొందరు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దానిపై స్పందించిన సీఎం రమేశ్‌... వైసీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌తో ఈ అంశంపై ఫోన్‌లో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాట్లాడి విద్యుత్‌ ఉద్యోగులకు వేతనాలు ఇప్పించాలని జగన్‌ను కోరారు. 
 
దానికి జగన్‌ సమ్మతించడంతో విద్యుత్‌ ఉద్యోగులు పలువురు ఆయనను కలిశారట. జగన్‌ ఈ విషయంపై మంత్రి కేటీఆర్‌తో మాట్లాడారు. బదిలీ అయిన ఉద్యోగులకు వేతనాలు ఇప్పించాలని కోరారు. ఆ మేరకు లేఖ కూడా రాశారు. అనంతరం విద్యుత్‌ ఉద్యోగులు తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను కలిసి తమ కష్టాలు చెప్పుకొన్నారు.  కేటీఆర్‌ దీనిపై స్పందించి, తెలంగాణ విద్యుత్‌ సంస్థల యాజమాన్యాలతో మాట్లాడారు. ‘బదిలీ అయిన ఉద్యోగులు జీతాల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ల ఉసురు మనకెందుకు! జీతాలు ఇవ్వండని కోరారు. ఆ అంశం ఆయన పరిధిలో ఉందని అధికారులు స్పష్టం చేశారు. దీంతో కేటీఆర్‌ కూడా తన నిస్సహాయత వ్యక్తం చేసినట్టు తెలిసింది.

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

కోదండరామి రెడ్డి ఆవిష్కరించిన ఇట్లు... మీ సినిమా పోస్టర్

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలలో సుమయా రెడ్డి‌ నటిస్తున్న డియర్ ఉమ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments