Webdunia - Bharat's app for daily news and videos

Install App

చెడ్డి గ్యాంగ్ స‌భ్యులు వీరే! కదలికలపై పోలీసు నిఘా!!

Webdunia
శుక్రవారం, 10 డిశెంబరు 2021 (16:41 IST)
కృష్ణా జిల్లాలో చెడ్డీ గ్యాంగ్ కలక‌లం ఇంకా త‌గ్గ‌లేదు. ఈ ముఠా ఎప్పుడు ఎక్క‌డ దాడి చేస్తుందో అని ప్ర‌జ‌లు భ‌య‌ప‌డుతున్నారు. దీనికి త‌గిన‌ట్లే, తస్మాత్ జాగ్రత్త అంటూ పోలీసులు ప్ర‌చారం చేస్తున్నారు.  చెడ్డి గ్యాంగ్ కదలికల నేపథ్యంలో జిల్లా అంతటా పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్ర‌జ‌లు ఆందోళన వీడి అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. 

 
చెడ్డిగ్యాంగ్ పేరుతో రాష్ట్రంలోకి దొంగల ముఠా వచ్చింది... రాత్రుళ్లు ఎవరైనా మీ ఇంటి తలుపులు తట్టినా తెరవద్దు.. పొరుగు రాష్ట్రాల వారు అనుమానాస్పద స్థితిలో మీకు తారసపడితే వెంటనే డయల్ 100 కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వండి.... అంటూ పోలీసులు ప్ర‌క‌ట‌న చేశారు. అనుమానితులు, అపరచిత వ్యక్తుల పట్ల అప్రమత్తతో వ్యవహరించండంటూ పోలీసులు చేస్తున్న ఈ హెచ్చరికలు కృష్ణాజిల్లా వాసులకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. 

 
కృష్ణా, గుంటూరు జిల్లాల్లోకి అంతరాష్ట్ర దొంగల ముఠాలు చొరబడ్డాయన్న పోలీస్ ఉన్నతాధికారుల సమాచారంతో కృష్ణాజిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. ఇటువంటి దొంగల ముఠా  బారిన పడి జిల్లాలో ఏ ఒక్కరూ నష్టపోకూడదని జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. 
 

స్టేషన్ల వారీగా దొంగల ముఠా సమాచారం ఇచ్చి వారి కదలికలు ఏ విధంగా ఉంటాయో? వారి నుండి ఏ రక్షణ పొందాలనే దానిపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సచివాలయ పోలీసుల ద్వారా అవగాహన కల్పించటంతో పాటు ప్రధాన కూడళ్లల్లో ఆటోల ద్వారా మైక్ ప్రచారం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ రౌడీ వేర్ బ్రాండ్ కు ఔట్ లుక్ ఇండియా బిజినెస్ అవార్డ్

వికటకవి చూసి గర్వంగా అనిపించింది.. నిర్మాత రామ్ తాళ్లూరి

రామ్ పోతినేని సినిమాకు తమిళ సంగీత ద్వయం వివేక్ - మెర్విన్

ఉజ్జయిని మహాకాళేశ్వర్ టెంపుల్ సాక్షిగా కన్నప్ప రిలీజ్ డేట్ ప్రకటన

వెన్నెల కిషోర్ నటించిన శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ రిలీజ్ డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

బార్లీ వాటర్ ఎందుకు తాగాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

తర్వాతి కథనం
Show comments