Webdunia - Bharat's app for daily news and videos

Install App

నూజివీడులో కరోనా వైరస్ : జూన్ 8 వరకు లాక్డౌన్ పొడగింపు...

Webdunia
మంగళవారం, 12 మే 2020 (11:41 IST)
కృష్ణా జిల్లా నూజివీడులో కరోనా వైరస్ పాజిటివ్ కేసు నమోదైంది. దీంతో ఈ ప్రాంతంలో లాక్డౌన్‌ను వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు పొడగించారు. ఈ మేరకు తాహసీల్దారు ఎం. సురేష్ కుమార్ ఆదేశాలు జారీచేశారు. 
 
స్థానిక మైలవరం రోడ్డుకు చెందిన ఓ మహిళకు నూజివీడు ఆసుపత్రిలో నిర్వహించిన వైరస్ నిర్ధారణ పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో పూర్తిస్థాయిలో నిర్ధారించుకునేందుకు ఆమె నుంచి మరిన్ని శాంపిల్స్ సేకరించి విజయవాడ పంపించారు. అక్కడ నిర్వహించిన పరీక్షల్లోనూ కరోనా పాజిటివ్ అని తేలింది. 
 
దీంతో సోమవారం నుంచి 28 రోజుల పాటు.. అంటే జూన్ 8వ తేదీ వరకు నూజివీడు పట్టణంలో లాక్డౌన్ కొనసాగుతుందని తాహసీల్దారు వెల్లడించారు. రోడ్‌‌జోన్‌లో తప్ప మిగతా అన్ని ప్రాంతాల్లో ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే కూరగాయలు, నిత్యావసర దుకాణాలు తెరవాలని ఆయన ఆదేశించారు. కాగా, ఇప్పటికే కృష్ణలంక భ్రమరాంబపురంలోని సతీశ్ కుమార్ రోడ్డులో ఓ పాజిటివ్ కేసు ఉంది. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments