Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాము కాటుకు గురైన కానిస్టేబుల్ ను పరామర్శించిన కృష్ణాజిల్లా ఎస్పీ

Webdunia
శుక్రవారం, 20 ఆగస్టు 2021 (20:41 IST)
గడిచిన రాత్రి ముసునూరు పోలీస్స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ బీట్ విధులు నిర్వహిస్తున్న సమయంలో పాముకాటుకు గురై ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటుండగా ఈరోజు కృష్ణాజిల్లా ఎస్పీ శ్రీ సిద్ధార్థ కౌశల్ ఐపీఎస్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాముకాటుకు గురైన కానిస్టేబుల్ శివ కిరణ్ ను పరామర్శించి, అతని ఆరోగ్య పరిస్థితులను గూర్చి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
 
అలాగే రాత్రి సమయం అయినప్పటికీ పాముకాటుకు గురైన సమయంలో ఎలాంటి భయానికి లోను కాకుండా అత్యంత సమయస్ఫూర్తిగా వ్యవహరించి తోటి సహచర కానిస్టేబుల్ యొక్క ప్రాణాలు కాపాడిన కిషోర్ ను ప్రత్యేకంగా అభినందించారు.
 
శివ కిరణ్ తో మాట్లాడుతూ గడిచిన రాత్రి నుండి ఇప్పటివరకు శరీరంలో ఏమైనా మార్పులు చోటు చేసుకున్నది లేనిది, ఆరోగ్యం ఏ విధంగా ఉన్నది అడిగి తెలుసుకున్నారు. పాము కాటు ఇవన్నీ ఈ కాలంలో సర్వసాధారణమని వాటి గూర్చి ఆందోళన చెందవలసిన, అవసరం లేదని, మీ డిఎస్పీ, సిఐ పాముకాటుకు గురైన వద్ద నుండి ఇప్పటివరకు మిమ్మల్ని కంటికిరెప్పలా చూసుకున్నారని, ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు.

అందుకు ఆ కానిస్టేబుల్ సొంత బిడ్డలా ఇప్పటివరకు నా యొక్క యోగక్షేమాలు తెలుసుకున్న డి.ఎస్.పికి సిఐకి ప్రత్యేకంగా ధన్యవాదాలు అని, మీ ఆధ్వర్యంలో విధులు నిర్వర్తించి నందుకు చాలా ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తపరిచాడు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments