Webdunia - Bharat's app for daily news and videos

Install App

మద్యం మత్తులో జోగుతుంటే.. దెయ్యం పట్టిందని.. చేతులు కాల్చేశారు..

మద్యం మత్తులో జోగుతున్న మహిళకు దెయ్యం పట్టిందని నిప్పులు పట్టించిన ఘటన కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం అశ్వారావుపేట మండలంలోని నారంవారిగూడెం గ్రామ సమీప

Webdunia
ఆదివారం, 18 జూన్ 2017 (16:54 IST)
మద్యం మత్తులో జోగుతున్న మహిళకు దెయ్యం పట్టిందని నిప్పులు పట్టించిన ఘటన కొత్తగూడెం జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం అశ్వారావుపేట మండలంలోని నారంవారిగూడెం గ్రామ సమీపంలోని కొత్త కాలనీకి చెందిన వెంకమ్మ మే 19వ తేదీన మద్యం తాగిన మత్తులో తూలుతూ గ్రామంలో కలియతిరిగింది. ఆ సమయంలో మరో మహిళ తనకు దేవత పూనిందంటూ ఊగిపోయింది.
 
వెంకమ్మకు దెయ్యం పట్టిందని తెలిపింది. దెయ్యాన్ని వదిలించాలంటే ఆమె చేతుల్లో నిప్పులు పొయ్యాలని ఆదేశించింది. అంతే.. ఆమె ఆదేశాలను ఇద్దరు యువకులు అమలు పరిచారు. ఆమె చేతులను బలంగా పట్టుకుని ఆ చేతుల్లో నిప్పులు ఉంచారు. దీంతో ఆమె తీవ్రంగా కాలిపోయింది. ఆమె ఆర్తనాదాలు చేస్తున్నా వినిపించుకోలేదు. రెండు చేతులు తీవ్రంగా కాలిన తరువాత విడిచిపెట్టారు.
 
నెల రోజులు ముగిసినా ఆమె చేతులకైన గాయాలు మానలేదు. దీనిని గమనించిన పలువురు పెద్దలు పంచాయతీ పెట్టారు. బాధిత మహిళకు చికిత్స చేయించాలని, ఘటనకు కారణమైన వారిని ఆదేశించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

తెలుగులో పా.. పా..గా రాబోతున్న త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ డా..డా

వైవిఎస్ చౌదరి సినిమాలో వీణారావు ఫస్ట్ దర్శన్ లాంచ్ చేసిన సుప్రియ, స్వప్నాదత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments