Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా చీఫ్ జగన్‌కు టీడీపీ యువ నేత సంక్రాంతి కానుక.. ఏంటది?

వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి సంక్రాంతి కానుక తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నేత ఒకరు సంక్రాంతి కానుక ఇవ్వనున్నారు. ఆయన ఇచ్చే కానుక ఎంటో తెలుసా? తన సొంత పార్టీ అధికార తెలుగుదేశం పార్టీకి టాటా చెప్ప

Webdunia
సోమవారం, 16 జనవరి 2017 (13:00 IST)
వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డికి సంక్రాంతి కానుక తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నేత ఒకరు సంక్రాంతి కానుక ఇవ్వనున్నారు. ఆయన ఇచ్చే కానుక ఎంటో తెలుసా? తన సొంత పార్టీ అధికార తెలుగుదేశం పార్టీకి టాటా చెప్పి... వైకాపాలో చేరనున్నారు. దీంతో ఈ జిల్లాకు చెందిన తూగో శిబిరం చాలా ఖుషీగా ఫీలవుతుంది.
 
కోటగిరి విద్యాసాగర్ రావు. స్వర్గీయ ఎన్టీఆర్ మంత్రివర్గంలో సీనియర్ మంత్రిగా పని చేశారు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలోనూ అదేవిధంగా వ్యవహరించారు. ఆ తర్వాత మారిన పరిస్థితుల దృష్ట్యా ఆయన రాజకీయాలకు దూరం కాగా, ఆయన తనయుడు కోటగిరి శ్రీధర్ మాత్రం టీడీపీలో కొనసాగుతున్నారు.
 
ఇపుడు ఈయన తన పొలిటికల్ మకాంను వైకాపాకు మార్చాలని నిర్ణయించుకున్నారు. ఇదే అంశంపై ఆయన ఆదివారం లోటస్ పాండ్‌లో జగన్‌తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైకాపాలో చేరడానికి సుముఖత వ్యక్తంచేశారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా జగన్ తీరును ప్రశంసిస్తూ 2019 ఎన్నికల్లో అతడే హాట్ ఫేవరిట్ అంటూ విశ్వాసం వ్యక్తంచేశారు.
 
ఈనెల 29వ తేదీన ద్వారకా తిరుమలలో జరిగే బహిరంగసభలో కోటగిరి శ్రీధర్ లాంఛనంగా వైసీపీలో చేరనున్నారు. ఈ పరిణామంతో తెలుగుదేశం పార్టీ ఆకర్షణ శక్తిని నిలువరించగలిగానన్న నైతిక స్థైర్యం జగన్‌కు దక్కుతుందని తూగో జిల్లాకు చెందిన వైసీపీ శ్రేణులు భావిస్తున్నాయి. 

సురేష్ ప్రొడక్షన్స్ సెలబ్రేటింగ్ 60 గ్లోరియస్ ఇయర్స్

చిన్న సినిమాలను బతికించండి, డర్టీ ఫెలో ప్రీ రిలీజ్ లో దర్శకుడు ఆడారి మూర్తి సాయి

కేన్స్‌లో పదర్శించిన 'కన్నప్ప‌' టీజర్ - మే‌ 30న తెలుగు టీజర్

రేవ్ పార్టీలో హేమ పట్టుబడింది, ఆ వీడియో సంగతి తేలుస్తాం: బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్

బంగారు దుస్తులతో ఆధునిక రావణుడిగా కేజీఎఫ్ హీరో

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

కుర్చీలో కూర్చొని అదేపనిగా కాళ్లూపుతున్నారా?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

తర్వాతి కథనం
Show comments