Webdunia - Bharat's app for daily news and videos

Install App

'జుట్టు పట్టుకుని పైకితీసుకొచ్చి' పరిచయం చేయాలన్న కోరిక లేదు : కె.రోశయ్య

రాజకీయాల్లో తనకంటూ వారసులు ఎవరూ లేరనీ ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి కె.రోశయ్య అన్నారు. ఐదేళ్ళ గవర్నర్ పాలన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన.. ఇక శేష జీవితాన్ని ప్రశాంతంగా

Webdunia
మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (08:13 IST)
రాజకీయాల్లో తనకంటూ వారసులు ఎవరూ లేరనీ ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి కె.రోశయ్య అన్నారు. ఐదేళ్ళ గవర్నర్ పాలన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న ఆయన.. ఇక శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని భావిస్తున్నారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ.. వారసులను తయారు చేయాలన్న ఆలోచన ఏనాడూ రాలేదని, అలా ఒక వారసుడిని జుట్టు పట్టుకుని పైకి తీసుకొచ్చి, 'నా వారసుడు' అంటూ పరిచయం చేయాలన్న కోరిక అస్సలు లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు సాధించిన అన్నింటితోనూ ఆనందంగా ఉన్నానని, ఇకపై ప్రశాంత జీవనం గడపాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. 
 
అదేసమయంలో విశ్రాంతి సమయంలో పుస్తకం రాయాలన్న ఆలోచన తనకు లేదన్నారు. తానేమీ దేశం కోసం త్యాగం చేయలేదని అన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఎంతో మంది జీవితాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని, అలాంటి వారి గురించి భావి తరాలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. వారి త్యాగాలతో పోల్చుకుంటే తానేమీ చేయలేదని రోశయ్య చెప్పుకొచ్చారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments