Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీలక్ష్మి అవినీతి బాగోతాన్ని వెలికి తీస్తాం : మంత్రి కొల్లు రవీంద్ర

వరుణ్
శుక్రవారం, 2 ఆగస్టు 2024 (16:53 IST)
ఏపీ పురపాలక శాఖ పూర్వ ప్రత్యేక కార్యదర్శి శ్రీలక్ష్మి ప్రజా ధనంతో నిర్మించిన పార్కుకు తన తండ్రి పేరు పెట్టిన అంశంతో పాటు ఆమె అవినీతినంతా వెలికి తీస్తామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మచిలీపట్నంలో బందరులో పంచాయతీరాజ్ కాలనీలో రూ.2.18 కోట్ల ప్రజాధనంతో నిర్మించిన పార్కుకు శ్రీలక్ష్మి తన తండ్రి పేరు పెట్టడం, ఆయన విగ్రహం ఏర్పాటు చేయడంపై 'శ్రీలక్ష్మి.. నీ మహిమలూ' శీర్షికన గురువారం ఓ దినపత్రికలో వార్త వచ్చిన విషయం తెల్సిందే. దీనిపై మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. 
 
మాజీ ఎమ్మెల్యే పేర్ని నాని, శ్రీలక్ష్మి కలిసి ప్రజల డబ్బుతో నిర్మించిన పార్కులో విగ్రహం ఏర్పాటు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ నిధుల నుంచి రూ.2 కోట్లు నగరపాలిక నుంచి రూ.18 లక్షలు ఖర్చు చేస్తే కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకుంటారా అని ప్రశ్నించారు. తండ్రి విగ్రహం పెట్టాలన్న ఆలోచన ఉంటే శ్రీలక్ష్మి సొంత ఖర్చుతో పెట్టుకోవాలని గతంలోనే చెప్పామన్నారు. టీడీపీ హయాంలో బందరులో పార్కులను అభివృద్ధి చేస్తే జగన్ ప్రభుత్వం వాటిని అధ్వానంగా చేసిందని విమర్శించారు.
 
టీడీపీ హయాంలో పంచాయతీరాజ్ కాలనీ పార్కుకు కొనకళ్ల గణపతి పేరు పెట్టాలని భావించి, మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానిస్తే.. వైకాపా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. పార్కుల విషయంలో జరిగిన అక్రమాలపై విచారణ చేయిస్తామని, ఎంత ఖర్చు చేశారో.. ఎంత తిన్నారో మొత్తం బయటకు కక్కిస్తామని తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐతే ఏటంటావిప్పుడు?: జీబ్రా మెగా ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి కామెడీ (Video)

ఇప్పటికీ పోసాని నోరు అదుపుకాలేదు.. తక్షణం అరెస్టు చేయాలి : నిర్మాత నట్టి కుమార్

"టాక్సిక్" కోసం వందలాది చెట్లను నరికేసారు.. కేజీఎఫ్ హీరోపై కేసు

బాలకృష్ణ 109వ సినిమా టైటిల్ డాకూ మహరాజ్ - తాజా అప్ డేట్ !

ఆగమ్ బా యూట్యూబర్ గోల్డ్ ప్లే బటన్‌ను అన్ బాక్స్ చేసిన తరుణ్ భాస్కర్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దుమ్ము లేదా డస్ట్ అలర్జీ ఉందా? ఐతే ఇలా చేయండి

అరటి పండులో ఆరోగ్య ప్రయోజనాలు, ఏంటవి?

వర్షాకాలం, శీతాకాలంలో మయొనైజ్ వాడకూడదట..

హార్ట్ ఎటాక్ రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

క్యాన్సర్‌పై విజయం సాధించడానికి గ్లోబల్ నిపుణులతో భాగస్వామ్యం- విజ్ఞాన మార్పిడి: అపోలో క్యాన్సర్ కాంక్లేవ్

తర్వాతి కథనం
Show comments