Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాజీ సిఎం కిరణ్‌ తమ్ముడికి ఆ పదవి ఇచ్చేస్తున్నారా?

మాజీ సిఎం కిరణ్‌ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. చాలా రోజుల గ్యాప్ తరువాత రాజకీయాల్లోకి రావడం, అందులోను తెలుగుదేశం పార్టీలోకి కిషోర్ కుమార్ రెడ్డి వెళ్ళడం దాదాపు ఖాయమైన విషయం తెలిసిందే. ఇప్పటికే టి

Webdunia
సోమవారం, 20 నవంబరు 2017 (17:12 IST)
మాజీ సిఎం కిరణ్‌ కుమార్ రెడ్డి తమ్ముడు కిషోర్ కుమార్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ బంపర్ ఆఫర్ ఇవ్వనుంది. చాలా రోజుల గ్యాప్ తరువాత రాజకీయాల్లోకి రావడం, అందులోను తెలుగుదేశం పార్టీలోకి కిషోర్ కుమార్ రెడ్డి వెళ్ళడం దాదాపు ఖాయమైన విషయం తెలిసిందే. ఇప్పటికే టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును కలిసిన కిషోర్ కుమార్ రెడ్డి పదవులతో పాటు వచ్చే ఎన్నికల్లో సీటు కూడా ఖరారు చేసుకుని మరీ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. అంతేకాదు పార్టీలోకి రావడమే ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం పదవిని అలంకరించబోతున్నారు కిషోర్ కుమార్ రెడ్డి. 
 
ఈ నెల 23వ తేదీన కిషోర్ కుమార్ రెడ్డి తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఆ తరువాత కొన్ని రోజుల వ్యవధిలోనే టిటిడి ఛైర్మన్ పదవిని ఆయన అలంకరించబోతున్నారు. చంద్రబాబు నాయుడు నుంచి స్పష్టమైన హామీ కిషోర్ కుమార్ రెడ్డికి లభించిందట. అందుకే కిషోర్ తన అన్నతో గొడవపడి మరీ పార్టీ మారుతున్నారు. ఇన్ని నెలలుగా ఖాళీగా ఉన్న టిటిడి ఛైర్మన్ పోస్టును బాబు భర్తీ చేయడంతో పాటు కొత్తగా పార్టీలోకి వస్తున్న వ్యక్తి ఈ పదవిని కట్టబెడితే పరిణామాలు ఎలా ఉంటాయనేది చర్చ జరుగుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: సల్మాన్ ఖాన్‌, రష్మిక మందన్నకెమిస్ట్రీ ఫెయిల్

రోషన్ కనకాల మోగ్లీ 2025 నుంచి బండి సరోజ్ కుమార్ లుక్

Sai Kumar : సాయి కుమార్‌ కు అభినయ వాచస్పతి అవార్డుతో సన్మానం

మ్యాడ్ స్క్వేర్ నాలుగు రోజుల్లో.70 కోట్ల గ్రాస్ చేసింది : సూర్యదేవర నాగవంశీ

Nani: HIT: ది 3rd కేస్ నుంచి న్యూ పోస్టర్ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హింద్‌వేర్ స్మార్ట్ అప్లయెన్సెస్ వారి మార్కస్ 80 బిల్ట్-ఇన్ ఓవెన్‌తో వంట

గర్భధారణ సమయంలో మహిళలు లెగ్గింగ్స్ ధరించవచ్చా?

ఈ 5 పదార్థాలను పరగడుపున తింటే?

రాత్రి పడుకునే ముందు జాజికాయ నీరు తాగితే?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

తర్వాతి కథనం
Show comments