Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీజేపీ మిత్రక్షమో.. విపక్షమో అర్థం కావడంలేదు : కేఈ కృష్ణమూర్తి

Webdunia
ఆదివారం, 1 మార్చి 2015 (14:12 IST)
కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తమకు మిత్రపక్షమో.. లేక విపక్షమో అర్థం కావడం లేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి బీజేపీ అన్యాయం చేసిందని ఆరోపించిన ఆయన రెండు పార్టీల మధ్య మైత్రిపై అనుమానం వ్యక్తం చేశారు. 
 
ఆదివారం విజయవాడలో రిజిస్ట్రేషన్ శాఖాధికారులతో జరిపిన సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తీవ్ర ఆర్థిక లోటుతో ఇబ్బంది పడుతున్న ఏపీ సర్కారు ఆశ, నిరాశల మధ్య కొనసాగుతోందన్నారు. ఈ క్రమంలో ఆదుకోవాల్సిన కేంద్రం అన్యాయం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
 
విభజన చట్టం మేరకు కూడా ఏపీకి న్యాయం చేయడం లేదన్నారు. ఇక ప్రత్యేక హోదా కల్పించే అంశంపై బీజేపీ పిల్లిమొగ్గలు వేస్తోందని విమర్శించారు. గత ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు స్వయంగా హామీలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. 

డీ-హైడ్రేషన్‌తో ఆస్పత్రిలో చేరిన షారూఖ్ ఖాన్..

Rave Party: నేనో ఆడపిల్లను, బర్త్ డే పార్టీ అంటే వెళ్లా, నాకేం తెలియదు: నటి ఆషీరాయ్

హారర్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లర్ గా అదా శర్మ C.D సెన్సార్ పూర్తి

లవ్ మీ చిత్రం రీష్యూట్ నిజమే - అందుకే శనివారం విడుదల చేస్తున్నాం : ఆశిష్

మంచు లక్ష్మి ఆదిపర్వం పై సెన్సార్ ప్రశంస - ఐదు భాషల్లో విడుదల

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

Show comments