Webdunia - Bharat's app for daily news and videos

Install App

సింగపూర్‌లో కేసీఆర్ బిజీ బిజీ: హైకమిషనర్‌తో భేటీ!

Webdunia
గురువారం, 21 ఆగస్టు 2014 (11:26 IST)
సింగపూర్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బిజీ బిజీగా ఉన్నారు. బుధవారం సింగపూర్ చేరిన కేసీఆర్ సింగపూర్‌లోని రిట్జ్ కార్టన్ హోటల్లో వద్ద కెసిఆర్‌కు ఐఐఎం పూర్వ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు.
 
ఐఐఎం పూర్వ విద్యార్థులు గురువారం కార్యక్రమం నిర్వహించనున్న స్టేడియాన్ని కెసిఆర్ సందర్శించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు సింగపూర్ హైకమిషనర్‌తో కెసిఆర్ భేటీ కానున్నారు.
 
మరుసటి రోజు 23న ఉదయం సింగపూర్ నుంచి కెసిఆర్ కౌలాలంపూర్‌కు చేరుకుంటారు. ఆ రోజు అక్కడే ఉండి 24వ తేదీ రాత్రికి హైదరాబాద్‌కు చేరుకుంటారు. 
 
ముఖ్యమంత్రి వెంట ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్ర, పరిశ్రమలశాఖ కమిషనర్ జయేష్ రంజన్, ఐటీశాఖ కార్యదర్శి హర్‌ప్రీత్ సింగ్, ముఖ్యమంత్రి అదనపుకార్యదర్శి స్మితా సబర్వాల్, ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments