పెళ్లి చేసుకుని లైంగిక కోర్కె తీర్చమన్న అసిస్టెంట్ ప్రొఫెసర్‌...

Webdunia
ఆదివారం, 17 మే 2020 (10:42 IST)
విద్యాబుద్ధులు చెప్పాల్సిన గురువుల్లో కొందరు కామాంధులుగా మారిపోతున్నారు. ఇలాంటి వారిలో ఉన్నత చదువులు చదువుకున్నవారు కూడా ఉన్నారు. తాజాగా తన వద్ద చదువుకునే ఓ విద్యార్థినిని పెళ్ళి చేసుకుని లైంగిక కోర్కె తీర్చాలంటూ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ వేధించాడు. దీంతో ఆ విద్యార్థిని ఈ వేధింపులు భరించకే పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా అచ్చంపల్లిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని అచ్చంపల్లికి చెందిన కోలా హరీశ్ అనే వ్యక్తి, ఉప్పల్ సమీపంలో నివాసం ఉంటూ, ఓ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసరుగా పని చేస్తున్నాడు. 
 
తన వద్ద చదువుకునే ఓ విద్యార్థినితో పరిచయం పెంచుకున్నాడు. ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. ఫోన్లు, చాటింగ్‌ల తర్వాత, తనను ప్రేమించాలని ఒత్తిడి చేయసాగాడు. అయితే, అతనితో ప్రేమాయణం నెరపడం ఇష్టంలోని ఆ విద్యార్థిని అతన్ని దూరంపెట్టసాగింది. 
 
అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫోన్లు చేసినా, మెసేజ్‌లు పెట్టినా పట్టించుకోలేదు. తనను దూరం పెడుతోందని భావించి, కోపం పెంచుకున్న హరీశ్, తనతో సన్నిహితంగా ఉన్న చిత్రాలను ఆమెకు, ఆమె కుటుంబీకులకు పంపించాడు. 
 
తనతో గతంలో ఉన్నట్టుగానే ఉండకుంటే, వీటిని సోషల్ మీడియాలో పెడతానని బెదిరింపులకు దిగాడు. దీంతో యువతి రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి, ఫిర్యాదు చేసింది. టెక్నికల్ ఎవిడెన్స్‌ను కలెక్ట్ చేసిన పోలీసులు, హరీశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Prerna Arora: హిందీ లోనే కాక దక్షినాది లో కూడా ఆదరణ పొందుతున్న ప్రేరణ అరోరా

Kiran Abbavaram: చెన్నై లవ్ స్టోరీ సినిమా కంటెంట్ పై కాన్ఫిడెంట్ : కిరణ్ అబ్బవరం

Suriya4: సూర్య, నజ్రియా నజీమ్ చిత్రం షూటింగ్ షెడ్యూల్‌ ప్రారంభమైయింది

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం