Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుండెపోటు వల్లే కన్నా లక్ష్మీనారాయణ కోడలు చనిపోయారు: వైద్యులు

Webdunia
శుక్రవారం, 29 మే 2020 (09:03 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ శాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కోడలు గురువారం అనుమానాస్పదంగా చనిపోయారు. దీనిపై రకరకాలైన ఊహాగానాలు, పుకార్లు వచ్చాయి. అయితే, వైద్యులు మాత్రం ఈ మరణానికి గల కారణాలను వివరించారు. ఆమె కార్డియాక్ అరెస్ట్ వల్లే చనిపోయారని తేల్చారు. 
 
కన్నా లక్ష్మీనారాయణ కోడలు సుహారిక గురువారం మధ్యాహ్నం 11.30 గంటల సమయంలో తన మాదాపూర్‌లోని మీనాక్షి టవర్స్‌లో ఉన్న తన స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అక్కడ జరిగిన పార్టీలో ఆమె బంధువులు... స్నేహితులతో కలిసి పాల్గొన్నారు. 
 
ఈ పార్టీలో ఆమె గంటకు పైగా నృత్యం చేసినట్టు సమాచారం. ఆ తర్వాత ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయిందట. ఆ వెంటనే ఆమెను రాయదుర్గ్‌లోని ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి చేరుకునేలోపు ఆమె మరణించినట్టు వైద్యులు వెల్లడించారు. 
 
దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె మృతదేహాం ఉస్మానియా ఆస్పత్రిలో ఉంచి, పోస్టుమార్టం చేశారు. ఇందులో ఆమె మృతికి గల కారణాలు వెల్లడికావడంతో ఆమె మృతిపై ఉన్న పుకార్లకు చెక్ పడినట్టయింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Viswant: భావనను వివాహం చేసుకున్న హీరో విశ్వంత్ దుడ్డుంపూడి

Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమా మొదలు

ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వారిదే : అల్లు అరవింద్ సంచలన వ్యాఖ్యలు

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రభాస్ స్పిరిట్ లో కనిపించనున్నారా !

పెంచల్ రెడ్డి జీవిత కథతో ఆపద్భాంధవుడు చిత్రం: భీమగాని సుధాకర్ గౌడ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

తర్వాతి కథనం
Show comments