Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్త నాక్కావాలి... అతడి కోసం చివరి రక్తపు బొట్టు వరకూ పోరాడుతా... మాజీ ఎమ్మెల్యే కోడలు

తన భర్తను తన నుంచి దూరం చేశారంటూ కడప మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డిపై ఆయన కోడలు వాసంతి రెడ్డి ఆరోపణలు చేశారు. తన సమస్యను ఐద్వా మహిళా సంఘం దృష్టికి తీసుకెళ్లింది. అక్కడ ఆమె మాట్లాడుతూ... తనకు భర్త తప్ప వేరే ఏమీ వద్దని చెప్పారు. ఆస్తిపాస్తులు వద్దన

Webdunia
శుక్రవారం, 14 అక్టోబరు 2016 (12:57 IST)
తన భర్తను తన నుంచి దూరం చేశారంటూ కడప మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డిపై ఆయన కోడలు వాసంతి రెడ్డి ఆరోపణలు చేశారు. తన సమస్యను ఐద్వా మహిళా సంఘం దృష్టికి తీసుకెళ్లింది. అక్కడ ఆమె మాట్లాడుతూ... తనకు భర్త తప్ప వేరే ఏమీ వద్దని చెప్పారు. ఆస్తిపాస్తులు వద్దనీ, అతడితో జీవితాంతం కలిసి ఉండటాన్నే కోరుకుంటున్నట్లు చెప్పారు. అతడి కోసం చివరి రక్తపు బొట్టు వరకూ పోరాటం చేస్తానని ఆమె వెల్లడించారు.
 
కాగా శివానందరెడ్డి కుమారుడు ఓబుల్ రెడ్డి 2015 ఏప్రిల్ నెలలో వాసంతిని వివాహమాడారు. ఐతే అతడికి అంతకుముందే వివాహమైందనీ, తన మొదటి భార్యకు విడాకులు ఇచ్చి తనను వివాహం చేసుకుంటున్నట్లు తెలిపారని వాసంతి తెలియజేశారు. కానీ గత కొన్ని రోజుల క్రితం ఇంట్లో తన పెద్దవాళ్లు తనను వద్దంటున్నారని చెప్పి తనను విడిచిపెట్టి తన భర్త వెళ్లిపోయారనీ, పెద్ద మనుషులను పంపినా పట్టించుకోవడం లేదని ఆమె వాపోయారు. రాజకీయ పలుకుబడి ఉపయోగించి తనను బెదిరిస్తున్నారని ఆరోపించారు. తన సెల ఫోనుకు అసభ్య పదజాలంతో కూడిన సందేశాలను పంపుతున్నారని అన్నారు. తనకు న్యాయం చేయాలని మహిళా సంఘ సభ్యులకు విజ్ఞప్తి చేశారు.

వెబ్ దునియా తెలుగు వార్తలు, మరిన్ని విశేషాలు పొందేందుకు Mobile APP డౌన్లోడ్ చేసుకునేందుకు ఈ లింకుపై క్లిక్ చేయండి.

 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చికెన్, మటన్ కంటే ఇందులో ప్రోటీన్లు ఎక్కువ? శాకాహారులకు బెస్ట్ ఫుడ్ ఇదే

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

తర్వాతి కథనం
Show comments