Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇది రాజకీయ విమర్శలు చేసే సమయం కాదు : కేఏ పాల్ (Video)

ఠాగూర్
బుధవారం, 4 సెప్టెంబరు 2024 (10:49 IST)
విజయవాడ నగరాన్ని బుడమేరు వరద నీరు ముంచెత్తిందని, అనేక ప్రాంతాలు ఇప్పటికీ జలదిగ్బంధంలో చిక్కుకుని ఉన్నాయని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో వరద బాధితులకు అండగా నిలబడి, సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. పైగా, ఇది రాజకీయాలు చేసే సమయం కాదని ఆయన వ్యాఖ్యానించారు. 
 
వరద నీరు ముంచెత్తిన విజయవాడ అజిత్ సింగ్ నగర్‌లో ఆయన పర్యటించి, అనేక మంది వరద బాధితులకు వివిధ రకాల సహాయాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బుడమేరును ఆక్రమించిన రాజకీయ నేతలు, బడా నేతలు భారీ భవంతులను నిర్మించడం వల్లే ఈ విపత్కర పరిస్థితులకు ప్రధాన కారణమన్నారు. అందువల్ల బుడమేరు ఆక్రమణలను తక్షణం తొలగిస్తేనే భవిష్యత్‌లో విజయవాడ నగరానికి జలగండం ఉండదన్నారు. 
 
ఇపుడు సంభవించిన వరదల కారణంగా మునిగిపోయిన కాలనీలకు చెందిన ప్రజలను ఆదుకోవాలని ఆయన కోరారు. ఇందుకోసం తన వంతు సాయం చేస్తానని తెలిపారు. పైగా, విజయ్ మాల్యా వంటి కోటీశ్వరులకు లక్ష కోట్ల రూపాయలు మాఫీ చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇపుడు ఈ వరద బాధితులను ఆదుకునేందుకు కేవలం పది వేల కోట్ల రూపాయల నిధులను ఇవ్వాలని ఆయన కోరారు. 


 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తప్పు చేసినట్టు నిరూపిస్తే నా భర్తను వదిలేస్తా : జానీ మాస్టర్ సతీమణి

మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర విజృంభణం ఆగమనం డేట్ ఫిక్స్

మా నాన్న సూపర్ హీరో' నుంచి నాన్న సాంగ్ రిలీజ్

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దులో 1960లో జరిగిన కథతో శర్వానంద్, సంపత్ నంది చిత్రం

జానీ మాస్టర్ ఇష్యూలో రాజకీయరంగు - మీడియాపై కేసుపెడతానన్న జానీమాస్టర్ భార్య అయేషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైదరాబాద్‌లో బెస్పోక్ టైలరింగ్, ఫైన్ క్లాతింగ్‌లో 100 ఏళ్ల వారసత్వం కలిగిన పిఎన్ రావు కార్యక్రమాలు

డిజైన్ డెమోక్రసీ 2024-డిజైన్, ఆర్ట్- ఇన్నోవేషన్ యొక్క భవిష్యత్తు

మెక్‌డొనాల్డ్స్ ఇండియా నుంచి మెక్‌క్రిస్పీ చికెన్ బర్గర్, క్రిస్పీ వెజ్జీ బర్గర్‌

మునగాకును ఉడకబెట్టిన నీటిని ప్రతిరోజూ ఉదయం తాగితే..

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

తర్వాతి కథనం
Show comments