Webdunia - Bharat's app for daily news and videos

Install App

పోలీస్ స్టేష‌న్లు కావవి జ‌గ‌న‌న్న స్టేష‌న్లు

Webdunia
శనివారం, 31 జులై 2021 (10:59 IST)
ఎస్సీ, ఎస్టీ ప‌రిర‌క్ష‌ణ చట్టాన్నివైసీపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంద‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమాపై అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులు బనాయించి, జైలుకు పంపడం విచారకరమ‌న్నారు.

విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియా స‌మావేశంలో మాట్లాడుతూ, పాలనా వైఫల్యాల గురించి ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులపై అక్రమ కేసులు,, గృహ నిర్భంధాలు, ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టటం తగద‌న్నారు. కొండపల్లి లో అక్రమ క్వారీయింగ్ తవ్వకాలు, ఆక్రమణలు గురించి ప్రశ్నించిన దేవినేని ఉమాపై వైసిపి వర్గీయులు దాడి చేయటం దుర్మార్గమ‌ని ఖండించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పోలీస్ స్టేషన్లు జగనన్న స్టేషన్లుగా మారాయ‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ప్రజాతంత్ర వాదులంతా ప్రభుత్వ, పోలీసు చర్యలను ఖండించాల‌ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ కోరారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ను ఎప్ప‌టిక‌పుడు తాము నిర‌సిస్తూనే ఉన్నామ‌ని, అయినా పాల‌కుల్లో చ‌ల‌నం లేద‌న్నారు.

కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు క‌ల‌సి ఆస్తి ప‌న్నుపై కుటిల నాట‌కం ఆడుతున్నాయ‌ని, విలువ ఆధారితంగా ఆస్తి ప‌న్ను ప్ర‌వేశ‌పెట్టాయ‌ని విమ‌ర్శించారు. ఇలా ప‌న్ను క‌డుతూ పోతే, సొంత ఇంటి దారు కొంత కాలానికి రుణ గ్ర‌స్తులు అయిపోతార‌ని రామ‌కృష్ణ పేర్కొన్నారు. ఆస్తి ప‌న్ను పెంపును వెంట‌నే విర‌మించాల‌ని రాష్ట్ర ప్ర‌బుత్వాన్ని ఆయ‌న డిమాండు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పుష్పరాజ్ "పీలింగ్స్" పాట రెడీ.. హీట్ పెంచేసిన డీఎస్పీ.. బన్నీ పొట్టిగా వున్నాడే! (video)

కన్నడ బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య.. కారణం ఏంటి?

డాల్బీ విజన్ 4కే, అట్మాస్ టెక్నాలజీలో క సినిమా : హీరో కిరణ్ అబ్బవరం

M4M చూసి కిల్ల‌ర్ ఎవ‌రో గెస్ చేస్తే లక్ష రూపాయలు బహుమతి : డైరెక్ట‌ర్ మోహన్ వడ్లపట్ల

రామ్ చ‌ర‌ణ్, జాన్వీ క‌పూర్‌, బుచ్చిబాబు సానా చిత్రంలో మున్నాభాయ్ దివ్వేందు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

తర్వాతి కథనం
Show comments