Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాసపై ప్రజలకున్న భ్రమలతోనే ఓట్లేస్తున్నారు : జనారెడ్డి

Webdunia
శనివారం, 21 మే 2016 (17:26 IST)
తెలంగాణ రాష్ట్ర సమితిపై ప్రజలకు ఇంకా అనేక భ్రమలు ఉన్నాయనీ, అందువల్లే వారికి ప్రజలు ఓట్లు వేస్తున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ నేత కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ తెరాస సర్కారు ఏదో చేస్తుందని నమ్మి ప్రజలు ఓట్లు వేశారని అన్నారు. ప్రజలు కోరుకుంటున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలుచేయాలని సూచించారు. 
 
ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు. పాలేరులో విజయం సాధించిన తుమ్మల నాగేశ్వర్‌రావుకు ఆయన శుభాకాంక్షలను తెలియజేశారు. ఎన్నికల్లో గెలుపోటములు సహజమన్నారు. ఈ ఓటమితో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నిరాశచెందాల్సిన అవసరం లేదన్నారు. ఓడిపోయినప్పుడు నిరాశ, బాధ సహజమే అయినా కాంగ్రెస్ శ్రేణులు ఈ ఓటమిని సవాలుగా తీసుకుని గెలుపుకోసం కష్టపడాలని పిలుపునిచ్చారు.

మనమే చిత్రం తల్లితండ్రులకు డెడికేట్ - శతమానం భవతి కంటే డబుల్ హిట్ : శర్వానంద్

సినిమాల్లో మన చరిత్ర, సంస్క్రుతిని కాపాడండి : అభిజిత్ గోకలే

సీరియల్ నటి రిధిమాతో శుభ్ మన్ గిల్ వివాహం.. ఎప్పుడు?

ఆడియెన్స్ కోరుకుంటున్న సరికొత్త కంటెంట్ మా సత్యభామ లో ఉంది : దర్శకుడు సుమన్ చిక్కాల

స్వయంభూ లో సవ్యసాచిలా రెండు కత్తులతో యుద్ధం చేస్తున్న నిఖిల్

బాదం పప్పులు తిన్నవారికి ఇవన్నీ

కాలేయంను పాడుచేసే 10 సాధారణ అలవాట్లు, ఏంటవి?

వేసవిలో 90 శాతం నీరు వున్న ఈ 5 తింటే శరీరం పూర్తి హెడ్రేట్

ప్రోస్టేట్ కోసం ఆర్జీ హాస్పిటల్స్ పయనీర్స్ నానో స్లిమ్ లేజర్ సర్జరీ

జెన్ జెడ్ ఫ్యాషన్-టెక్ బ్రాండ్ న్యూమీ: హైదరాబాద్‌లోని శరత్ సిటీ మాల్‌లో అతిపెద్ద రిటైల్ స్టోర్‌ ప్రారంభం

తర్వాతి కథనం
Show comments