Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ్యోతి సురేఖ ధైర్య సాహసాలు అభినందనీయం: గవర్నర్ బిశ్వభూషణ్

Webdunia
శనివారం, 14 సెప్టెంబరు 2019 (17:52 IST)
జ్యోతి సురేఖ పిన్న వయస్సులోనే విలువిద్య క్రీడలో అనితర సాధ్యమైన విజయాలను అందుకుని రాష్ట్రానికి గౌరవాన్ని తీసుకువచ్చారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ అన్నారు. సురేఖ సాధించిన విజయాలు చిన్నవి కావని దేశం మొత్తం గర్విస్తుందని గవర్నర్ తెలిపారు.

విలువిద్య ఛాపింయన్, అర్జున అవార్డు గ్రహీత వెన్నమ్ జ్యోతి సురేఖను రాజ్ భవన్ వేదికగా శనివారం గవర్నర్ సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిచందన్ మాట్లాడుతూ 4 సంవత్సరాల 11 నెలల చిన్న వయస్సులోనే కృష్ణా నదిలో 5 కిలోమీటర్ల దూరం ఈత కొట్టిన సురేఖ అతి పిన్న వయస్సు స్విమ్మర్‌గా ప్రత్యేకమైన రికార్డును సొంతం చేసుకున్నారన్నారు.

అత్యంత  ధైర్యసాహసాహలతో కూడుకున్న ఈ రికార్డు  సాధించిన  జ్యోతి సురేఖ అభినందనీయిరాలని గవర్నర్ పేర్కొన్నారు. నెదర్లాండ్‌లో జరిగిన 50వ ప్రపంచ విలువిద్య ఛాంపియన్‌షిప్ 2019లో కాంస్య పతకం సాధించిన  నేపధ్యంలో జ్యోతి సురేఖను గవర్నర్ హరిచందన్ రాజ్ భవన్‌లోని దర్బార్ హాల్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో సన్మానించారు.

భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో విజయాలను అందుకుని దేశ ప్రతిష్టను ఇనుమడింపచేయాలని గవర్నర్ అకాంక్షించారు. కార్యక్రమంలో రాజ్ భవన్ సంయుక్త కార్యదర్శి అర్జునరావు, ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ సభ్యులు ప‌లువురు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments