Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపాకు ఓటు వేయొద్దంటే అపుడు వినలేదు.. ఇపుడు చెప్పుతో కొట్టుకుంటున్నాం...

ఠాగూర్
మంగళవారం, 7 మే 2024 (09:10 IST)
గత ఎన్నికల్లో వైకాపా ఓటు వేయొద్దంటూ ప్రతి ఒక్కరూ మొత్తుకున్నారనీ అయినప్పటికీ తాను మాత్రం వినలేదని జనసేన నేత టీవీ రామారావు గుర్తు చేశారు. దీనికి ప్రతిఫలంగా ఇపుడు తన చెప్పుతో తానే కొట్టుకుంటున్నాంటూ చెప్పుతో కొట్టుకున్నారు. గొడారిగుంటలోని తన కార్యాలయంలో కొందరు ఎమ్మార్పీఎస్‌ నాయకులు ఆయనను కలిసి కూటమికి మద్దతు ప్రకటించారు. 
 
ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఐదేళ్ల కాలంలో ఎస్సీలకు జరిగిన అన్యాయాలను ప్రస్తావించారు. 'వైకాపాకు ఓటేయొద్దంటూ ఎంత చెప్పినా అప్పట్లో మీరు వినలేదు. ఇప్పుడు ఈ పాలనలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగింది' అన్నారు. వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు తన కారు డ్రైవరును హత్య చేయడం, సీతానగరంలో ఇసుకదందాను ప్రశ్నించిన వరప్రసాద్‌కు పోలీస్‌ స్టేషన్‌లోనే శిరోముండనం చేయించడం వంటి పలు ఘటనలను గుర్తుచేశారు. 
 
వెంకటాయపాలెం శిరోముండనం కేసులో తోట త్రిమూర్తులుకు జైలు శిక్ష పడినా వైకాపా ఆయనకు టికెట్‌ ఇవ్వడం.. ఎస్సీలకు సంబంధించి 27 సంక్షేమ పథకాల రద్దు చేయడం వంటి అంశాలపై ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో టీవీ రామారావు స్పందిస్తూ.. ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకున్నందుకు ధన్యవాదాలని వ్యాఖ్యానించారు. కూటమికి ఎస్సీలు మద్దతు పలకాలని కోరారు. 

ముద్రగడ అనుమతి తీసుకున్న తర్వాత ముద్రగడ క్రాంతిని జనసేనలో చేర్చుకుంటా : పవన్ కళ్యాణ్ 
 
తనపై విమర్శలు గుప్పిస్తున్న ముద్రగడ పద్మనాభం పట్ల జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరోమారు పెద్ద మనసు ప్రదర్శించారు. ముద్రగడ కుమార్తె ముద్రగడ క్రాంతి జనసేన పార్టీలో చేరేందుకు రాగా పవన్ కళ్యాణ్ వారించారు. ఒక కుటుంబాన్ని విడదీసే అలవాటు తనకు లేదన్నారు. తల్లీ కుమార్తెలను ఒకచోట కూర్చోబెట్టి మాట్లాడాతనని, ముద్రగడ పద్మనాభం అనుమతి తీసుకున్న తర్వాతే క్రాంతిని జనసేన పార్టీలో చేర్చుకుంటానని చెప్పారు. 
 
కాకినాడ జిల్లా తునిలో నిర్వహించిన వారాహి విజయభేరి సభలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రసంగించారు.  'ముద్రగడ పద్మనాభంగారి కుమార్తె జనసేన పార్టీకి మద్దతుగా మాట్లాడారు. అందుకు నేనే కారణం అంటూ నన్ను తిడుతున్నారు. నేను కులాలను, మనుషులను కలిపే వ్యక్తిని తప్ప... కుటుంబాలను విడదీసే వ్యక్తిని కాను. ముద్రగడ పద్మనాభంతో నాకు విభేదాలు లేవు. ఆయన కుటుంబాన్ని విడదీయాలనే ఆలోచన లేదు.
 
ఆయన కుమార్తె మన పార్టీ మీద నమ్మకంతో వచ్చారు. ఆమెను నా సోదరిలా గౌరవించే బాధ్యత నేను తీసుకుంటాను. అయితే ముద్రగడ కుమార్తె జనసేన పార్టీలో చేరే అంశంపై నేను ముద్రగడగారితో మాట్లాడి ఆయన అనుమతి తీసుకుంటాను. పెద్దవాళ్లు పది మాటలు అంటారు... నేను ముద్రగడను, ఆయన కుమార్తెను కలుపుతాను. వచ్చే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే ముద్రగడ పద్మనాభంగారి కుమార్తె క్రాంతిని ఎమ్మెల్యేగా నిలబెడతాను... గౌరవిస్తాను. ముద్రగడ వైసీపీకి వెళితే మాకేమీ లేదు. ఆయన నిర్ణయాన్ని గౌరవిస్తాను' అని స్పష్టం చేశారు. 
 
బూతులు, మూడు కబ్జాలు, ఆరు సెటిల్మెంట్లు... వైసీపీ ప్రభుత్వం గురించి ఇంతకంటే బాగా చెప్పలేం అని అన్నారు. పోలవరం నిర్మించడం సంగతి అటుంచితే కనీసం చెరువుల్లో పూడిక కూడా తీయించడం చేతకాని ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం అని ధ్వజమెత్తారు. ఓడిపోయేవాడే దాడులు చేస్తాడని, వైసీపీ ఓడిపోతోంది కాబట్టే మనవాళ్లపై దాడులకు దిగుతున్నారు అంటూ పవన్ పేర్కొన్నారు. సొంతచెల్లెలికి ఆస్తులు ఇవ్వడు, తల్లికి గౌరవం ఇవ్వడు, 30 వేల మంది ఆడపిల్లలు కనిపించుకుండా పోతే స్పందించని వ్యక్తి, విశాఖలో రూ.25 వేల కోట్ల విలువైన భూములు తాకట్టు పెట్టిన వ్యక్తి... రేపు మీ భూముల జోలికి రాడని గ్యారెంటీ ఏంటి అని పవన్ ప్రశ్నించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram gopal varma: పుష్కరాల్లో తొక్కిసలాట భక్తులు చనిపోతే.. దేవతలను అరెస్టు చేస్తారా?

Pawan Kalyan: హైదరాబాద్‌కు పవన్ కల్యాణ్.. నమ్మలేకపోతున్నానన్న రష్మిక

సంధ్య థియేటర్ తొక్కిసలాటకు అల్లు అర్జున్‌నే ఎలా బాధ్యులను చేస్తారు? నాని ప్రశ్న

డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు దినం పట్ల మనవరాళ్ళు రేవతి, అనురాధ హర్షం

వెంకటేష్ బర్త్‌డే - సంక్రాంతికి వస్తున్నాం సెకండ్ సింగిల్ ప్రోమో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

పెరుగుతో ఇవి కలుపుకుని తింటే ఎంతో ఆరోగ్యం, ఏంటవి?

ఆరోగ్యం కోసం ప్రతిరోజూ తాగాల్సిన పానీయాలు ఏమిటో తెలుసా?

పులి గింజలు శక్తి సామర్థ్యాలు మీకు తెలుసా?

లెమన్ వాటర్ ఎవరు తాగకూడదో తెలుసా?

తర్వాతి కథనం
Show comments