Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎవరిష్టం వారిది.. వస్తే రావొచ్చు.. రాకపోతే పోవచ్చు.. బాలయ్య

Webdunia
శనివారం, 17 నవంబరు 2018 (12:32 IST)
ప్రజలే దేవుళ్ళు. సమాజమే దేవాలయం అనే సిద్ధాంతంతో తాతగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ మాకు ఎంతో పవిత్రమైనది. మా నాన్నగారు స్వర్గీయ నందమూరి హరికృష్ణగారు సేవలందించిన తెలుగుదేశం పార్టీ తరపున ప్రస్తుతం మా సోదరి సుహాసిని గారు కూకట్ పల్లి నియోజక వర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 
 
స్త్రీలు సమాజంలో ఉన్నతమైన పాత్రను పోషించాలని నమ్మే కుటుంబం మాది. ఇదే స్ఫూర్తితో ప్రజా సేవకు సిద్ధపడుతున్న మా సోదరి సుహాసిని గారికి విజయం వరించాలని ఆకాక్షిస్తున్నాం.. అంటూ నందమూరి కళ్యాణ్ రామ్, నందమూరి తారకరామారావులు ట్విట్టర్లో తెలిపారు. ఇలా సుహాసినికి ఇద్దరు మద్దతు పలికారు. కానీ టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎన్నికల ప్రచారంపై మాత్రం ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. 
 
ఇదిలా ఉంటే.. నందమూరి సుహాసినికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంపై నందమూరి హీరో బాలయ్య స్పందించారు. సుహాసినితో కలిసి ఎన్టీఆర్ ఘాట్‌లో ఎన్టీఆర్ సమాధికి నివాళులర్పించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల కోసం తమ పార్టీ పుట్టిందన్నారు. ప్రజల కోసం ఎన్టీఆర్, చంద్రబాబు ఎనలేని కృషి చేసారన్నారన్నారు. 
 
ఈ నెల 26 నుంచి తెలంగాణ వ్యాప్తంగా మహాకూటమి తరపున  ప్రచారం చేస్తానని ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంపై మాట్లాడుతూ.. ఎవరి ఇష్టం వాళ్లదని, రావాలనుకుంటే వస్తారు.. లేదంటే రారని కుండబద్ధలు కొట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ మరోసారి మన టైమ్ రావాలంటున్న చిరంజీవి, బాబీ

‘వార్ 2’ టీజర్‌కు వచ్చిన స్పందన చూస్తే ఎంతో ఆనందంగా వుంది :ఎన్టీఆర్

నేను ద్రోణాచార్యుని కాదు, ఇంకా విద్యార్థినే, మీరు కలిసి నేర్చుకోండి : కమల్ హాసన్

Poonam Kaur: త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై మళ్లీ ఇన్‌స్టా స్టోరీ.. వదిలేది లేదంటున్న పూనమ్

Peddi: సత్తిబాబు కిళ్లీకొట్టు దగ్గర పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్, బుజ్జిబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తర్వాతి కథనం
Show comments