Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ అభిమానిని చంపిన జూ.ఎన్టీఆర్ అభిమాని... కారణమేమిటంటే...

మా హీరో గొప్పవాడు.. కాదు మాహీరోనే గొప్పవాడు.. అని ఇద్దరు అభిమానులు ఎవరికి వారు వాదించుకున్నారు. ఆ వాదనకాస్తా చినికిచినికి గాలివానై ఒక హీరో అభిమాని మరో హీరో అభిమానిని కత్తితో పొడవడంతో అతడు మరణించాడు.

Webdunia
గురువారం, 25 ఆగస్టు 2016 (11:45 IST)
మా హీరో గొప్పవాడు.. కాదు మాహీరోనే గొప్పవాడు.. అని ఇద్దరు అభిమానులు ఎవరికి వారు వాదించుకున్నారు. ఆ వాదనకాస్తా చినికిచినికి గాలివానై ఒక హీరో అభిమాని మరో హీరో అభిమానిని కత్తితో పొడవడంతో అతడు మరణించాడు. చనిపోయిన అభిమాని పవన్ కళ్యాణ్ అభిమాని కాగా, చంపింది జూనియర్ ఎన్టీఆర్ అభిమాని. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తిరుపతి పట్టణానికి చెందిన వినోద్‌ రాయల్‌ జనసేన పార్టీ అధినేత పవన కల్యాణ్‌కు వీరాభిమాని. పార్టీ తరపున తరచూ నగరంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం కర్ణాటకలోని కోలార్‌లో పవన్‌కల్యాణ్‌ అభిమానుల ఆధ్వర్యంలో జరిగిన అవయవదాన కార్యక్రమానికి వినోద్‌ రాయల్ హాజరయ్యాడు. 
 
ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కూడా కొంతమంది హాజరయ్యారు. కార్యక్రమం జరుగుతుండగా, వినోద్ రాయల్.. జై పవన్ అంటూ నినాదాలు చేయడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అడ్డుచెప్పాడు. దీంతో ఇరువురి మధ్య తీవ్రస్థాయిలో వాదనలు జరిగాయి. దీంతో తమ హీరో గొప్ప అంటూ ఎవరికి వారు వాగ్వాదానికి దిగారు. 
 
ఈ నేపథ్యంలో అసహనానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ అభిమాని వినోద్‌ను కత్తితో పొడిచాడు. తీవ్రంగా గాయపడిన అతడిని స్నేహితులు చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. సోమవారం నగరంలోని వినోద్‌ స్వగృహానికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. జనసేన కార్యకర్తలు పెద్దఎత్తున తరలివచ్చి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్‌... తిరుపతికి వెళ్లి వినోద్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. 

బులుగు రంగు చీరలో మెరిసిన జాన్వీ కపూర్

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘కన్నప్ప టీం సందడి- ఆకట్టుకున్న కన్నప్ప టీజర్

భవితను మార్చిన వ్యక్తి కథతో విజయ్ ఆంటోనీ తుఫాన్ రాబోతుంది

అనుష్క, విజయశాంతి లతో మూవీ చేస్తానంటున్న నిర్మాత ఎస్ కే బషీద్

బెంగళూరు రేవ్ పార్టీ.. ఎంట్రీ ఫీజు రూ.50 లక్షలు

చియా గింజలు తింటే ఎలాంటి ఉపయోగాలు?

రెక్టల్ క్యాన్సర్ రోగిని కాపాడేందుకు ట్రూబీమ్ రాపిడార్క్ సాంకేతికత: అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్

డ్రై ఫ్రూట్స్‌ను ఖాళీ కడుపుతో తింటే ఎంత లాభమో?

నారింజ పండ్లు తీసుకుంటే.. డీహైడ్రేషన్‌ పరార్.. గుండె ఆరోగ్యానికి మేలు..

పాలులో రొట్టె కలిపి తింటే 8 అద్భుతమైన ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments