Webdunia - Bharat's app for daily news and videos

Install App

"జై తెలుగు" పేరుతో ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ

Webdunia
బుధవారం, 21 జూన్ 2023 (17:34 IST)
వచ్చే యేడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏపీలో ఒక కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకుంది. "జై తెలుగు" పేరుతో ఈ పార్టీని ప్రముఖ కవి, సినీ గేయరచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు ప్రారంభించారు. ఈ పార్టీ జెండాను కూడా వెల్లడించారు. పసుపు, ఎరుపు, నీలం, ఆకుపచ్చ రంగుల మధ్యలో తెలుపు రంగుతో జెండాను రూపొందించారు. 
 
తెలుపు రంగుపై ఒక రథాన్ని ఏర్పాటు చేసి దానికి "అ ఆ" అక్షరాలను చక్రాలుగా పెట్టారు. రథానికి పైభాగంలో జెండా ఏర్పాటు చేశారు. ఈ వివరాలను రామ లింగేశ్వరరావు విజయవాడ ప్రెస్ క్లబ్‌లో వెల్లడించారు. తెలుగు భాష సంస్కృతి కోసం కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేశానని చెప్పారు. తెలుగు భాష పరిరక్షణ ఆజెండాతోనే రాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు. 
 
పార్టీకి సంబంధించిన సదస్సులు ఆగస్టు నుంచి జిల్లాల వారీగా నిర్వహిస్తామని చెప్పారు. భాష, సంస్కృతులపై రాజకీయ నాయకులు, ప్రజలకు తగిన అవగాహన కల్పించడమే తన లక్ష్యమన్నారు. భాష, సంస్కృతుల విలువ అందరికీ తెలియజేయాలనే పార్టీని స్థాపించానన్నారు. పార్టీ జెండాపై గిడుగు రామ్మూర్తి, కందుకూరి వీరేశలింగం, పొట్టి శ్రీరాములు, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ చిత్రాలు ఉంటాయన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments