Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రావెల్స్ బస్సుల వివాదం: ఆధారాలతో వచ్చిన జేసీ ప్రభాకర్ రెడ్డి.. అరెస్ట్ చేసిన పోలీసులు

ట్రావెల్స్ బస్సులకు సంబంధించిన వివాదంలో ఏపీ టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రైవేటు బస్సుల అనుమతుల అంశంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్టీఏ ఆఫీసుకు వస్తుండగా పోలీ

Webdunia
మంగళవారం, 27 డిశెంబరు 2016 (11:35 IST)
ట్రావెల్స్ బస్సులకు సంబంధించిన వివాదంలో ఏపీ టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రైవేటు బస్సుల అనుమతుల అంశంపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఆర్టీఏ ఆఫీసుకు వస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ ఆర్టీఏ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేటు బస్సుల విషయంలో జేసీ సవాల్‌ను స్పీకరించి ఆర్టీఏ కార్యాలయానికి వచ్చానని టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఎమ్మెల్యే జేసీని గోషామహాల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు.  
 
అయితే తాను అన్ని ఆధారాలతో ఆర్టీయే కార్యాలయానికి వస్తే.. తనను అరెస్టు చేశారని, ఇది తగదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఈ ఘటనతో ఆర్టీయే కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనుమతి లేకుండా ట్రావెల్స్ నడుపుతున్నారని శ్రీనివాసగౌడ్ ఆరోపించగా, తమవద్ద అనుమతులన్నీ ఉన్నాయని, వాటిని చూపిస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలు ఇద్దరూ ఒకరిపై ఒకరు సవాలు విసురుకున్నారు. ఇంతలో జేసీని పోలీసులు అరెస్టు చేశారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఒక సెక్షన్ మీడియా అత్యుత్సాహం చూపుతుంది : ఆర్జీవీ

సిల్క్ స్మిత అఫీషియల్ బయోపిక్ లో చంద్రిక రవి

శ్రీ కనకదుర్గమ్మవారి ఆశీస్సులు కోరిన హరిహరవీరమల్లు టీమ్

ముంబై మెట్రో రైలెక్కిన పుష్ప 2.. ఎందుకు? (video)

కన్నప్ప లో శ్రీ కాళహస్తి పురాణ కథ తెలిపే గిరిజనులుగా అరియానా, వివియానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Asthma in Winter Season, ఈ సమస్యను తెచ్చే ఆహార పదార్ధాలు, పరిస్థితులు

ఓట్స్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

విటమిన్ డి లభించే 5 పదార్థాలు, ఏంటవి?

గర్భాశయ క్యాన్సర్‌తో బాధ పడుతున్న 83 ఏళ్ల మహిళకు విజయవంతంగా చికిత్స

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments