Webdunia - Bharat's app for daily news and videos

Install App

జగన్ అధికారంలోకి వస్తే సూసైడ్ చేసుకుంటాం : టీడీపీ ఎంపీ జేసీ దివాకర్

తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తాము చచ్చిపోతామంటూ వ్యాఖ్యానించారు. అందువల్ల రాష

Webdunia
శుక్రవారం, 9 జూన్ 2017 (16:13 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా అధినేత జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే తాము చచ్చిపోతామంటూ వ్యాఖ్యానించారు. అందువల్ల రాష్ట్రంలో మరోమారు సీఎంగా చంద్రబాబునే ఎన్నుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. 
 
అనంతపురం జిల్లా, రాయదుర్గం మండలంలో ఏరువాక కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నా మొక్కవోని దీక్షతో సమస్యలను అధికమిస్తూ సీఎం చంద్రబాబు ముందుకు వెళుతున్నారన్నారు. బాబు మళ్లీ సీఎం అయితే తప్ప మనకు భవిష్యత్ ఉండదన్నారు. అదే జగన్ వస్తే మేం చచ్చిపోతామన్నారు. 
 
మనిషి అన్న తర్వాత ఎక్కడో ఒక చోట లోటు పాట్లు ఉంటాయని, ఎవరిలో తప్పొప్పులు లేవని ప్రశ్నించారు. 2019లో మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తప్పా.. రాష్ట్రానికి భవిష్యత్ ఉండదని, ఆయన కార్యదీక్ష, పట్టుదలను చూసి ప్రజలు మళ్లీ టీడీపీని గెలిపించాలని జేసీ ప్రజలను కోరారు. పైసా నిధులు లేకపోయినా.. రాష్ట్రంలో ఎక్కడా పనులు ఆగడం లేదని, ఎన్టీఆర్ కలని చంద్రబాబు సాకారం చేస్తున్నారని జేసీ దివాకర్ రెడ్డి కొనియాడారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kingdom: యాక్షన్ ప్రోమోతో విజయ్ దేవరకొండ కింగ్‌డమ్ కొత్త అప్ డేట్

మాధవరం గామాన్ని ఆదర్శంగా Mr. సోల్జర్ చిత్రం సిద్ధం

AR Rahman: ఎస్‌జె సూర్య పాన్ ఇండియా ఫిల్మ్ కిల్లర్ కు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్

విజయ్ సేతుపతి, సంయుక్త, పూరి జగన్నాథ్ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం

Sridevi: కేజేఆర్ హీరోగా కోర్ట్ ఫేమ్ శ్రీదేవి హీరోయిన్ గా చిత్రం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

తర్వాతి కథనం
Show comments