Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీకి 'హోదా' ఇవ్వరాదని బీజేపీ నిర్ణయం.. మనం ఎంత మొత్తుకున్నా రాదు: జేసీ దివాకర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని భారతీయ జనతా పార్టీ గట్టి నిర్ణయం తీసుకుందని, అందువల్ల ఇపుడు మనం ఎన్ని చెప్పినా.. ఎంత మొత్తుకున్నా ప్రయోజనం ఉండదని టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ

Webdunia
శుక్రవారం, 5 ఆగస్టు 2016 (19:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకూడదని భారతీయ జనతా పార్టీ గట్టి నిర్ణయం తీసుకుందని, అందువల్ల ఇపుడు మనం ఎన్ని చెప్పినా.. ఎంత మొత్తుకున్నా ప్రయోజనం ఉండదని టీడీపీకి చెందిన అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను ఇచ్చే ఉద్దేశంలో బీజేపీ లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదాపై నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసేసుకుందన్నారు. అందువల్ల మనం ఎన్ని చెప్పినా, ఎంత మొత్తుకున్నా ప్రయోజనం ఉండదన్నారు. 
 
కేంద్రం తన నిర్ణయానికే కట్టుబడి ఉండేలా కనిపిస్తోందని మోడీతో భేటీ అనంతరం వ్యాఖ్యానించిన ఆయన, ఏపీ సమస్యను మిగతా రాష్ట్రాల సమస్యలతో పోల్చి చూడవద్దని ప్రధానికి విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. ఏపీ నష్టపోయిందని ఆయనకు మరోసారి గుర్తు చేశామని, అన్నీ తనకు తెలుసునని, ఆదుకుంటామని మాత్రమే మోడీ హామీ ఇచ్చారు. 

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments