Webdunia - Bharat's app for daily news and videos

Install App

అయ్యా జగన్.. నేను యాక్టర్‌నే.. నువ్వు జైలులో వుండొచ్చిన వాడివి: పవన్

Webdunia
శుక్రవారం, 29 మార్చి 2019 (11:51 IST)
వైసీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డిపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తనను యాక్టర్ అని సంబోధించిన జగన్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారు. తాను రాజకీయాల్లోకి రాకముందు యాక్టర్‌నే.. అన్నీ తెలుసుకున్న తర్వాతే రాజకీయాల్లో వచ్చానని చెప్పారు. అయితే జగన్ రాజకీయాల్లోకి రాకముందు జైలులో వుండి వచ్చారనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని ఫైర్ అయ్యారు. 
 
ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం చిత్తూరు, కడప జిల్లాల్లో పర్యటించిన పవన్ ఈ సందర్భంగా టీడీపీ చీఫ్ చంద్రబాబు, వైకాపా చీఫ్ జగన్మోహన్ రెడ్డిలపై నిప్పులు చెరిగారు. తాము అధికారంలోకి వస్తే రాయలసీమలో ఏ పరిశ్రమ ఏర్పాటైనా స్థానికులకు 60 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని పవన్ హామీ ఇచ్చారు. 
 
ఉద్యోగాల దరఖాస్తుల ద్వారా వసూలు చేసే సొమ్ముతో నిరుద్యోగ భృతి ఇస్తున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. జనసేన అధికారంలోకి వస్తే అన్ని ఉద్యోగాలకు ఒకేసారి ఫీజు చెల్లించే విధానాన్ని తీసుకొస్తామన్నారు. పదో తరగతి వరకు చదువుకున్న 25 వేల మందిని  పోలీసు సహాయకులుగా నియమిస్తామని పవన్ హామీ ఇచ్చారు.
 
అలాగే తనను రాయలసీమలో అడుగుపెట్టకుండా కుట్రలు చేస్తున్నారని.. తన హెలికాప్టర్‌కు అనుమతి రద్దు చేశారని పవన్ ఫైర్ అయ్యారు. హెలికాప్టర్ రద్దు ఆదేశాలను జగన్ ఇచ్చారా? లేక, బీజేపీ నేతలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. తాను ఎవరితో మాట్లాడితే వారే తన భాగస్వాములని అంటున్నారని, నిజానికి జగన్-అమిత్‌షాలే భాగస్వాములని అన్నారు.
 
జగన్‌లా తన వద్ద డొంకతిరుగుడు వ్యవహారాలు ఉండవని స్పష్టం చేశారు. తాను కేసీఆర్‌ను రెండుసార్లు కలిస్తే నేను టీఆర్ఎస్ భాగస్వామినని టీడీపీ విమర్శించిందని, జగన్ తనను టీడీపీ భాగస్వామి అంటున్నారని పవన్ గుర్తు చేశారు. నిజానికి బీజేపీ, టీఆర్ఎస్‌లకు జగనే భాగస్వామని ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

AlluArjun: పహల్గామ్‌ ఘటన క్షమించరాని చర్య: చిరంజీవి, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ

Venkatesh: సెంచరీ కొట్టిన విక్టరీ వెంకటేష్, అనిల్ రావిపూడి

Prabhas: సలార్, కల్కి, దేవర చిత్రాల సీక్వెల్స్ కు గ్రహాలు అడ్డుపడుతున్నాయా?

ఇద్దరు డైరెక్టర్లతో హరి హర వీర మల్లు రెండు భాగాలు పూర్తి?

కావ్య కీర్తి సోలో క్యారెక్టర్ గా హలో బేబీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

ఇమామి ప్యూర్ గ్లో బ్రాండ్ అంబాసిడర్‌గా రాశి ఖన్నా

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

ఆకాశంలో విమాన ప్రమాదం, పిల్ల-పిల్లిని సముద్రంలో పడేసింది (video)

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments