Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రజలు ఛాన్సిస్తే.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా: పవన్ కల్యాణ్ ప్రకటన

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సీఎం పగ్గాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అవకాశమిస్తే బాధ్యతాయుతమైన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని పవన్ అన్నారు. సీఎం అంటూ నినాదాలు చేసినంత మాత్రాన తాను ముఖ్యమంత్రి క

Webdunia
శుక్రవారం, 18 మే 2018 (15:12 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సీఎం పగ్గాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు అవకాశమిస్తే బాధ్యతాయుతమైన కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తానని పవన్ అన్నారు. సీఎం అంటూ నినాదాలు చేసినంత మాత్రాన తాను ముఖ్యమంత్రి కాలేనని, ప్రజల సమస్యలను అర్థం చేసుకున్న తర్వాతే సీఎం అవుతానని తెలిపారు. 
 
గంగవరం పోర్టు నిర్వాసితులను కలిసిన సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. నేతల స్వార్థం కోసం.. వారి కుటుంబాల కోసం ప్రభుత్వాలు పనిచేయరాదని.. ప్రజల సంక్షేమం కోసం పని చేయాలన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోకూడదని సూచించారు. టీడీపీ, బీజేపీలు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక పోయాయని మండిపడ్డారు.
 
అలాగే అభివృద్ధి ఫలాలను అందరికీ సమానంగా అందించాలన్న నినాదంతో ఈ నెల 20వ తేదీ నుంచి జనసేన ఆధ్వర్యంలో పోరాట యాత్రను ప్రారంభించనున్నట్టు పవన్ అన్నారు. యాత్ర మొత్తం 45 రోజులు కొనసాగుతుందన్నారు. 
 
దేశంలో ఎక్కడికి వెళ్లినా ఉత్తరాంధ్ర జిల్లాల వారే కనిపిస్తున్నారని, ఉపాధి కోసం వలస వెళ్లాల్సిన దుస్థితి ఇంకా అక్కడ నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాష్ట్రం మరోమారు ముక్కలవుతుందని, ప్రాంతాల మధ్య వైషమ్యాలు పెరిగిపోతాయని తెలిపారు.

సంబంధిత వార్తలు

'కంగువ'లో 10,000 మంది పాల్గొనే వార్ సీక్వెన్స్

పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments