సీఎం అయితేనే అసెంబ్లీకి వెళ్తారా? జగన్‌కు పవన్ సూటి ప్రశ్న, నారా లోకేష్ కరెప్షన్ చూడండి...

జనసేన ఆవిర్భావ సభలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని తూర్పారపడుతున్నారు. ఆయన మాటల్లోనే... ''ప్రత్యేక హోదా కోసం తెదేపాను అసెంబ్లీలో నిలదీసేందుకు జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ అసెంబ్లీకి వెళ్లడంలేదు. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితేనే అసెంబ్లీ

Webdunia
బుధవారం, 14 మార్చి 2018 (19:23 IST)
జనసేన ఆవిర్భావ సభలో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీని తూర్పారపడుతున్నారు. ఆయన మాటల్లోనే... ''ప్రత్యేక హోదా కోసం తెదేపాను అసెంబ్లీలో నిలదీసేందుకు జగన్ మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ అసెంబ్లీకి వెళ్లడంలేదు. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితేనే అసెంబ్లీకి వెళ్తారా? ఏపీ యువత ప్రాణాలను నేను పణంగా పెట్టను. నువ్వు మాట్లాడతావు.... వెళ్లిపోతావని నన్ను నిలదీశారు.
 
నా నేల కోసం మాతృభూమి కోసం నేను చనిపోయేందుకు సిద్ధం. 2014లోనూ ఇదే చెప్పాను. సాటి మనిషి సమస్యను చూసి కన్నీళ్లు కార్చే శక్తి వుందా మీకు. మీరు అసెంబ్లీలో కూర్చుని మాట్లాడుతున్నారు. అమరావతి రాజధాని కోసం భావోద్వేగానికి గురయ్యారు సీఎంగారు... కన్నీళ్లు కార్చారు... అనారోగ్యంతో చనిపోతున్నవారి కోసం కన్నీళ్లు పెట్టరా?
 
గత 2014 ఎన్నికల్లో స్కాం ఆంధ్రప్రదేశ్ నుంచి స్వర్ణాంధ్రప్రదేశ్ తెస్తామని చెప్పారు... కానీ అది కాలేదు కానీ కరెప్షన్ ఏపీ అయ్యిందండీ. రూ. 3 వేల లారీ ఇసుక దొరికితే... ఉచితం అని చెప్పి లారీ ఇసుకను రూ. 15 వేలు చేశారండీ. వెల్ఫేర్ హాస్టళ్లలో చదువుకున్న పిల్లల్ని ఫంక్షన్లకు ఎందుకు తీసుకెళుతున్నారండీ. వచ్చే 2019 ఎన్నికల్లో మీకు ఎందుకు మద్దతు ఇవ్వాలో చెప్పండి. పాలించాలంటే పెట్టి పుట్టాలా...
 
మీ అబ్బాయి నారా లోకేష్ గారి కరెప్షన్ మీ దృష్టికి వచ్చిందో లేదో ముఖ్యమంత్రిగారు. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ మాతో వుంటాడో లేదోనని కరెప్షన్ చేస్తారా? ఎర్ర చందనం అమ్మితే చక్కని రాజధాని అని చెప్పారు. ఎక్కడండీ? 2019 ఎన్నికలు మాత్రం మీకు అంత తేలిగ్గా వుండవండీ అని చెప్పారు పవన్ కళ్యాణ్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇన్వెస్టిగేటివ్ మిస్టరీ థ్రిల్లర్ గా కర్మణ్యే వాధికారస్తే చిత్రం

Rajinikanth: రజనీకాంత్ కు అదే ఆఖరి సినిమానా, రిటైర్ మెంట్ కారణమా?

Adivi Sesh: అడివి శేష్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ డకాయిట్ ఉగాదికి ఫిక్స్

తల్లి చనిపోయినా తిరువీర్ చెప్పకుండా షూటింగ్‌లో చేశాడు : కరుణ కుమార్

ఓ.. చెలియా లోని నాకోసం ఆ వెన్నెల.. బాణీ ఎంతో హాయిగా ఉంది : జేడీ చక్రవర్తి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

పింక్ రిబ్బన్‌కు మించి: అపోహలు పటాపంచలు, జీవితాల్లో స్ఫూర్తి

Beetroot Juice: బీట్ రూట్ జ్యూస్‌ను ప్రతిరోజూ పరగడుపున తీసుకుంటే?

ఉప్పు శనగలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

మోతాదుకి మించి చపాతీలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments