Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిమ్స్‌ ఆస్పత్రిలో పాతనోట్లను తీసుకుని కొత్త నోట్లిచ్చిన జనసేన కార్యకర్తలు..

జనసేన పార్టీ కార్యకర్తలు పాత నోట్లతో ఇబ్బందులు పడుతున్న వారికి చేయూతనిచ్చారు. శని, ఆదివారాలు బ్యాంకులు బంద్. ఈ నేపథ్యంలో నిమ్స్ ఆసుపత్రిలోని రోగులు ఇబ్బంది పడకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ

Webdunia
ఆదివారం, 27 నవంబరు 2016 (15:05 IST)
జనసేన పార్టీ కార్యకర్తలు పాత నోట్లతో ఇబ్బందులు పడుతున్న వారికి చేయూతనిచ్చారు. శని, ఆదివారాలు బ్యాంకులు బంద్. ఈ నేపథ్యంలో నిమ్స్ ఆసుపత్రిలోని రోగులు ఇబ్బంది పడకుండా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు ఆసుపత్రిలో పండ్లు, మందులు పంపిణీ చేశారు. బ్యాంక్ సెలవు రోజులు కావడంతో  జనసేన కార్యకర్తలు ఆదివారం నిమ్స్ ఆసుపత్రిలో పండ్లు, మందులు పంచి పెట్టారు. అనంతరం కొందరు రోగుల నుంచి పాత రూ.500, రూ.1000 నోట్లను తీసుకొని, కొత్త నోట్లను అందించారు. 
 
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు బ్యాంకులకు సెలవులు కావడంతో రోగులు ఇబ్బంది పడవద్దనే ఉద్దేశ్యంతో తమవంతు సహకారం అందించామన్నారు. పాత నోట్లను మార్చుకునే వీలు లేకపోవడంతో తాము కొత్త నోట్లను ఇచ్చామన్నారు. 
 
మరోవైపు పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం సరైనదేనని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ అన్నారు. అయితే ఈ నిర్ణయం అమలులో లోపాల గురింతే తాము ఆందోళన చెందామని చెప్పుకొచ్చారు. ప్రజాజీవనం సజావుగా సాగేలా, వ్యాపార లావాలదేవీలు జరిగేలా చూడాలని కేంద్రానికి చెప్పామని తెలిపారు.

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments