Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనసేన దూకుడు-హైదరాబాద్, ఉత్తరాంధ్ర నుంచి ఎంపిక ప్రక్రియ- పవన్ ప్రకటన

ముందస్తు ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తమవుతోంది. హైదరాబాద్, ఉత్తరాంధ్రలలో జనసేన ఎంపిక కోసం ఆ పార్టీ సోషల్ మీడియాలో ప్రకటన చేసింది. రాజకీయ ప్రక్రియలో నవతరం, మేధావులకు చోటు కల్పించాలనే ఉద్దేశంతో జనసేన

Webdunia
శనివారం, 6 మే 2017 (13:02 IST)
ముందస్తు ఎన్నికలకు జనసేన పార్టీ సమాయత్తమవుతోంది.  హైదరాబాద్, ఉత్తరాంధ్రలలో జనసేన ఎంపిక కోసం ఆ పార్టీ సోషల్ మీడియాలో ప్రకటన చేసింది. రాజకీయ ప్రక్రియలో నవతరం, మేధావులకు చోటు కల్పించాలనే ఉద్దేశంతో జనసేన తలపెట్టిన ఎంపిక ప్రక్రియను ఈసారి హైదరాబాద్, ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపింది. 
 
ఇంకా జనసేన విడుదల చేసిన ప్రకటనలో ఏముందంటే? ఈసారి ఎంపిక ప్రక్రియ గ్రేటర్ హైదరాబాద్, ఉత్తరాంధ్రలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో చేపట్టాలని నిర్ణయించాము. అనంతపురం జిల్లాలో జరిపిన ఎంపికలను జయప్రదం చేసినందుకు ఆ జిల్లా వాసులకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటనలో వెల్లడించారు. జనసేన తరపున క్షేత్రస్థాయిలో చురుకుగా పాల్గొనేవారిని గుర్తించడానికి మాత్రమే ఈ ప్రక్రియను చేపట్టినట్లు తెలిపారు. ఎంపిక ప్రక్రియ పోటీ పరీక్ష కాదని ముందే చెప్పామని, ఇది ప్రతిభను, శక్తియుక్తులను గుర్తించే ప్రక్రియ మాత్రమేనని పవన్ తెలిపారు. 
 
స్పీకర్, అనలిస్ట్-కంటెంట్ రైటర్ విభాగాలకు ఔత్సాహికులు తమ దరఖాస్తులను ఆన్‌లైన్ ద్వారా పంపవచ్చు. దరఖాస్తులు పంపి ఆన్ లైన్ యూఆర్ఎల్‌లను కూడా ఈ లేఖలో పవన్ పొందుపరిచారు. దరఖాస్తులను 06.05.2017 నుంచి 13.05.2017 రాత్రి 8 వరకు ఆన్‌లైన్‌లో పంపవచ్చు. ఈ రాజకీయ యజ్ఞంలో పాల్గొనదలచిన జన సైనికులకు, అభిమానులకు, యువతీ, యువకులకు, మేధావులు ఈ సందర్భంగా నా శుభాభినందనలు అంటూ పవన్ తెలిపారు. ఇకపోతే, యూఆర్ఎల్స్ కోసం జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ను సంప్రదించవచ్చు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments