Webdunia - Bharat's app for daily news and videos

Install App

బాబు చూడండి ప్రణబ్‌‍జీ...: జగన్, బాగానే చేస్తున్నారుగా... ప్రణబ్: జగన్ షాక్...

జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి ఒకింత షాక్ కొట్టే పరిస్థితి ఎదురైంది. ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడు పట్టింపు లేని ధోరణితో ఉన్నారంటూ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లి, ప్రత్యేక హోదాపై విజ్ఞా

Webdunia
మంగళవారం, 9 ఆగస్టు 2016 (11:40 IST)
జగన్ మోహన్ రెడ్డికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి ఒకింత షాక్ కొట్టే పరిస్థితి ఎదురైంది. ప్రత్యేక హోదాపై చంద్రబాబు నాయుడు పట్టింపు లేని ధోరణితో ఉన్నారంటూ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లి, ప్రత్యేక హోదాపై విజ్ఞాపన పత్రం అందించారు. పార్లమెంటులో ఇచ్చిన హామీని నెరవేర్చాలంటూ వారు రాష్ట్రపతి వద్ద విన్నవించుకున్నారు. 
 
అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి కూడా ఫిర్యాదు చేస్తూ ఉండటంతో మధ్యలో రాష్ట్రపతి వారికి అడ్డు తగులుతూ, చంద్రబాబు నాయుడుగారు బాగానే చేస్తున్నారు కదా... ఆయనలాంటి ముఖ్యమంత్రి మీకు దొరకడం చాలా అదృష్టం. రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింపజేసేందుకు ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారుగా అంటూ రాష్ట్రపతి చెప్పేసరికి వైకాపా ఎంపీలు షాక్ తిన్నట్లు సమాచారం.
 
రాష్ట్రపతిని కలిసిన అనంతరం వారు బయటకు రాగానే... మీరంతా మా నాయకుడిపై ఫిర్యాదు చేశారు కదా అని కొందరు తెదేపా ఎంపీలు పలుకరిస్తే... ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై మాట పడనిచ్చేట్లు లేరు. అలా మాట్లాడుతుంటే ఇక మేమేం చెబుతాం అని వైకాపాకు చెందిన కొందరు ఎంపీలు చెప్పినట్లు సమాచారం.

మహేష్ బాబు సినిమాపై ఆంగ్ల పత్రికలో వచ్చిన వార్తకు నిర్మాత కె.ఎల్. నారాయణ ఖండన

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments