Webdunia - Bharat's app for daily news and videos

Install App

జ‌గ‌న‌న్న కాల‌నీల్లో 7 ల‌క్ష‌ల ఇళ్ళు, శంకుస్థాప‌న‌లు షురూ!

Webdunia
గురువారం, 1 జులై 2021 (15:01 IST)
చెప్పాడంటే... చేస్తాడంతే! ఇదే స్లోగ‌న్‌తో ఏపీలో వై.ఎస్. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం... ముంద‌స్తుగా క్యాలెండ‌ర్ రిలీజ్ చేసి మ‌రీ పార్టీ మ్యానిఫెస్టోలో లోని కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగానే గురువారం ఆంధ్రప్ర‌దేశ్ అంత‌టా, జ‌గ‌న‌న్న కాల‌నీల‌లో శంకుస్థాప‌న కార్య‌క్ర‌మాలు ప్రారంభించారు. ఒక రోజు ముందు క్యాబినేట్ స‌మావేశంలో సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి త‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రులంద‌రికీ... రేప‌టి నుంచి పేద‌ల‌కు ఇళ్ళ శంకుస్థాప‌న‌లు చేయించండని ఆదేశించారు.
 
అంతే, నేటి ఉద‌య‌మే ఎమ్మెల్యేలు, మంత్రులంతా జ‌గ‌న‌న్న కాల‌నీల‌కు చేరిపోయారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు, ల‌బ్ధి దారుల‌ను ప‌లిపించి, వాళ్ళ స్థ‌లాల్లో ముగ్గు పోయించి... ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాప‌న చేయిస్తున్నారు. 
 
ఏపీలో రూర‌ల్, అర్బన్‌ కలిపి 9,024 లేఅవుట్లలో జగనన్న కాల ఇళ్ళ నిర్మాణానికి  శ్రీకారం చుట్టారు. మొత్తం 7 ల‌క్ష‌ల ఇళ్ళ‌ను దేశంలోనే రికార్డు స్థాయిలో నిర్మిస్తామ‌ని ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వివ‌రించారు. జులై 1, 3, 4 తేదీల్లో జగనన్న కాలనీల్లో (Jagananna Colony)నిర్మాణాలకు శంకుస్థాపన మహోత్సవం ఏర్పాటు చేశారు.
 
ఇప్ప‌టికే ల‌బ్ధిదారుల‌కు సెంటు భూమిని కేటాయించి, ప‌ట్టాలు కూడా పంపిణీ చేశారు. ఇపుడు ఆ కాల‌నీల‌లో ప్రతి ఇంటికి శంకుస్థాప‌న ప‌నిని ప్రారంభించారు. ప్ర‌తి ఇంటి నిర్మాణానికి 1 లక్షా 80 వేల ఆర్ధిక సహాయం అందించనున్నారు. వీటిని ఏడాదిలో పూర్తి చేయాల‌ని ఆదేశించారు. అలాగే, జ‌గ‌న‌న్న కాల‌నీల‌లో మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు 40 కోట్ల రూపాయ‌ల‌ను వెచ్చిస్తున్నారు.
 
ఇక‌పై సిటీల్లో జ‌గ‌న‌న్న టౌన్‌షిప్‌లు 
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం మధ్య తరగతి ప్రజల కోసం జగనన్న టౌన్‌షిప్‌లను ఏర్పాటు చేయనుంది. ఇందులో భాగంగా నగరాలు, పట్టణాల్లో స్థలాల్ని సేకరించి లాభాపేక్ష లేకుండా మధ్య తరగతి ప్రజలకు కేటాయించనున్నారు. దీని కోసం అర్బ‌న్ ఏరియాల్లో స్థ‌లాలు సేక‌రించాల‌ని సీఎం రెవిన్యూ అధికారుల‌ను ఆదేశించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

"గేమ్ ఛేంజర్" టీజర్‌ను ఏయే థియేటర్లలో రిలీజ్ చేస్తారు?

పుష్ప-2 నుంచి దేవీ శ్రీ ప్రసాద్‌ను పక్కనబెట్టేశారా? కారణం?

పారిశ్రామికవేత్త బర్త్‌డే పార్టీలో ఎంజాయ్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరోలు

త్రిబాణధారి బార్బరిక్ లో సరికొత్త అవతారంలో ఉదయ భాను

అమ్మవారి జాతర నేపథ్యంగా జాతర- మూవీ రివ్యూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎక్స్‌పైరీ డేట్ బిస్కెట్లు తింటే ఏమవుతుందో తెలుసా?

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయేందుకు 7 సింపుల్ టిప్స్

పనీర్ రోజా పువ్వులతో మహిళలకు అందం.. ఆరోగ్యం..

వర్క్ ఫ్రమ్ ఆఫీసే బెటర్.. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఒత్తిడి తప్పదా?

చీజ్ పఫ్ లొట్టలేసుకుని తింటారు, కానీ అవి ఏం చేస్తాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments