Webdunia - Bharat's app for daily news and videos

Install App

హర్యానా- ఏపీ ఎన్నికలకు లింకు పెట్టిన జగన్.. మళ్లీ ఈవీఎంలపై నింద

సెల్వి
గురువారం, 10 అక్టోబరు 2024 (07:37 IST)
ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది చరిత్రలోనే అత్యంత ఏకపక్ష ఓటర్ల జాబితా ఎన్‌డిఏ 164 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకోగా, జగన్‌కు చెందిన వైసీపీ 11 స్థానాలకు దిగజారింది. అప్పటి నుండి, జగన్ ఈవీఎంలపై నిందవేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఇదే కథను జగన్ సీన్ లోకి తెచ్చారు. తాజా హర్యానా ఎన్నికల అంశానికి ఈవీఎంలకు లింక్ పెట్టారు. 
 
ఏపీ తరహాలో హర్యానా ఎన్నికల ఫలితాలు ప్రజాభిప్రాయాన్ని కలవరపెడుతున్నాయని జగన్ ట్వీట్ చేశారు. కోర్టుల్లో కేసులు పెండింగ్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు హర్యానా ఎన్నికల ఫలితాలు భిన్నంగా లేవు. మనలాంటి ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యం ప్రబలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలి. రెండింటినీ నిర్ధారించడానికి ఏకైక మార్గం పేపర్ బ్యాలెట్‌కు తిరిగి వెళ్లడం అంటూ జగన్ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత ఈవీఎంలను వ్యతిరేకిస్తూ పేపర్ బ్యాలెట్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. 2019లో 151 గెలిచినప్పుడు జగన్‌కు ఈవీఎంలతో ఎలాంటి సమస్యా లేదు కానీ పరిస్థితి తారుమారయ్యాక ఈవీఎంలను తప్పుబడుతున్నారని టాక్ వస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రతన్ టాటా మృతిపై ఎస్ఎస్ రాజమౌళి కామెంట్స్...

నయనతార, విఘ్నేష్ శివన్.. ఓటీటీలో డాక్యుమెంటరీ

తమిళ టైటిల్ వేట్టయన్ ది హంటర్ పై సురేష్ బాబు, దిల్ రాజు, రానా దగ్గుబాటి వివరణ

బీబీ8 - నామినేషన్స్ వార్.. గంగవ్వకు దక్కిన నామినేషన్

సోషల్ మీడియాలో రజనీకాంత్ "వేట్టయన్" బాయ్ కాట్ ట్రెండింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి పండ్లను ఎలాంటి సమస్యలు వున్నవారు తినకూడదు?

హెచ్-ఎం కొత్త పండుగ కలెక్షన్: వేడుకల స్ఫూర్తితో సందర్భోచిత దుస్తులు

ఎన్ఆర్ఐల కోసం ఏఐ-ఆధారిత రిమోట్ పేరెంట్ హెల్త్ మానిటరింగ్ సర్వీస్ డోజీ శ్రవణ్

ఎలాంటి కాఫీ తాగితే ఆరోగ్యానికి మంచిది?

ఈ 5 పాటిస్తే జీవితం ఆనందమయం, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments