Webdunia - Bharat's app for daily news and videos

Install App

Jagan: చంద్రబాబు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలతో హాట్‌లైన్ కనెక్షన్‌లో వున్నారు.. జగన్

సెల్వి
బుధవారం, 13 ఆగస్టు 2025 (17:09 IST)
వైకాపా చీఫ్ జగన్.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో హాట్‌లైన్ కనెక్షన్‌లో ఉన్నారని ఆరోపించారు. "ఈ రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఎన్నికల మోసం, ఓటుకు నోటు గురించి మాట్లాడుతున్నారు కానీ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క మాట కూడా మాట్లాడరు. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల మోసం గురించి దేశం మొత్తం మాట్లాడుకుంటోంది, కానీ ఈ రాహుల్ గాంధీకి రాష్ట్రం గురించి మాట్లాడే సమయం లేదు. ఎందుకంటే చంద్రబాబు రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలతో హాట్‌లైన్ కనెక్షన్‌లో ఉన్నారు" అని జగన్ అన్నారు.
 
ఓట్ల చోరీ అంటూ మాట్లాడుతున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ విషయాన్ని ఎందుకు ప్రస్తావించడం లేదని వైఎస్ జగన్ ప్రశ్నించారు. ఏపీలో 2024 ఎన్నికల నాటికి.. ఓట్ల లెక్కింపు సమయానికి 12.5శాతం ఓట్లు పెరిగాయన్న వైఎస్ జగన్.. 48 లక్షల ఓట్లు పెరిగాయని ఇదెలా సాధ్యమైందని ప్రశ్నించారు.
 
ఇదే సమయంలో చంద్రబాబును ఉద్దేశించి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ముఖ్యమంత్రిగా ఉన్నావ్.. నీ జీవితానికి బహుశా ఇవే ఆఖరి ఎన్నికలు కావచ్చు.. రామా, కృష్ణా అని అనుకునే వయసులో.. కనీసం ఆ మాటలు అన్నా అనుకుంటే కాస్త పుణ్యమైనా వస్తుంది.ఈ మాదిరిగా చేసుకుంటూ పోతే నరకానికే పోతావ్. ఇప్పుడైనా కాస్త మార్పు తెచ్చుకో చంద్రబాబూ" అంటూ వైఎస్ జగన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెగాస్టార్ చిరంజీవి పై సెస్సెషనల్ కామెంట్ చేసిన అనిల్ రావిపూడి

NTR: ఎన్టీఆర్, నాగార్జునల భిన్నమైన పాత్రలకు తొలి అడుగులు సక్సెస్ సాధిస్తాయా?

చిత్రపురి కార్మిలకు మోసం చేసిన వల్లభనేని అనిల్‌ కు మంత్రులు, అధికారులు అండ ?

బిగ్ బాస్ సీజన్ 19: పహల్గామ్ దాడి బాధితురాలు హిమాన్షి నర్వాల్.. ఈ షోలో ఎంట్రీ ఇస్తారా?

పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ భద్రకాళి డేట్ ఫిక్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

తర్వాతి కథనం
Show comments