జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై ట్విస్ట్... ఏం జరిగిందంటే..?

ఠాగూర్
సోమవారం, 20 జనవరి 2025 (16:51 IST)
మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత వైఎస్. జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు కేసులో చిన్నపాటి ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు రిజిస్ట్రీ మరో ధర్మాసనానికి బదిలీ చేసింది. గతంలో విచారణ జరిపిన జస్టిస్ అభయ్ ఓకా, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం నుంచి జస్టిస్ వీవీ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ధర్మాసనానికి మార్చింది.
 
గత 12 ఏళ్లుగా ట్రయల్ ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ ధర్మాసనం ముందు రఘురామ తరపు న్యాయవాది శ్రీనివాసన్ వాదించారు. గత పదేళ్లుగా ఒక్క డిశ్చార్జ్ అప్లికేషన్‌ను కూడా డిస్పోజ్ చేయలేదని గుర్తుచేశారు. సీబీఐ, నిందితులు కుమ్మక్కై కేసును ఒక్క అడుగు కూడా కదలనీయడం లేదన్నారు. డిశ్చార్జ్ పిటిషన్లపై ఎలాంటి నిర్ణయాలను వెలువరించకుండానే ఐదుగురు జడ్జీలు బదిలీ అయ్యారని... ఒక్క డిశ్చార్జ్ పిటిషన్‌పై కూడా నిర్ణయం వెలువరించకుండానే జడ్జిలు బదిలీ కావడంలో కుట్రకోణం దాగి ఉందని పేర్కొన్నారు. 
 
ఈ నేపథ్యంలోనే కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశామని... అయితే బదిలీ సాధ్యం కాదని గత విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని... అందువల్ల కేసు విచారణ పూర్తి స్థాయిలో జరగాలని కోరుకుంటున్నట్టు రఘురామ న్యాయవాది తెలిపారు.
 
గత పదేళ్లుగా జగన్ బెయిల్‌పై ఉన్నారని... సుప్రీంకోర్టు, హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ ట్రయల్‌లో జాప్యం జరుగుతోందని... కేసులో వాదనలు వినిపించేందుకు కొంత సమయం కావాలని సీబీఐ తరపున న్యాయవాది కోరారు. ఈ కేసును హైకోర్టు మానిటర్ చేస్తోందని... కేసు అక్కడ పెండింగ్‌లో ఉందని జగన్ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గీ తెలిపారు. ఈ క్రమంలో విచారణను వచ్చే సోమవారానికి ధర్మాసనం వాయిదా వేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Rashmika: రష్మిక తో బోల్డ్ సినిమా తీశా - రేటింగ్ ఒకటిన్నర ఇస్తారేమో : అల్లు అరవింద్

Ramcharan: ఎ.ఆర్. రెహమాన్.. పెద్ది ఫస్ట్ సింగిల్ చికిరి చికిరి అదిరిపోయే ప్రోమో రిలీజ్

Monalisa : కుంభమేళా భామ మోనాలిసా కథానాయికగా లైఫ్ చిత్రం ప్రారంభం

Nagarjuna: డాల్బీ ఆట్మాస్ సౌండ్ తో శివ రీరిలీజ్ - చిరంజీవిలా చిరస్మరణీయం : వర్మ

మంగళసూత్రం మహిళలపై లైంగిక దాడులను ఆపిందా? చిన్మయి ఘాటు వ్యాఖ్యలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

అదేపనిగా సెల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటున్నారా?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

తర్వాతి కథనం
Show comments