పిన్నెల్లి పాపాలు .. ఈవీఎంను ధ్వంసం చేస్తున్న అనుచరుడు.. వీడియో

వరుణ్
బుధవారం, 5 జూన్ 2024 (16:52 IST)
పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం కారంపూడి మండలం ఒప్పిచర్ల గ్రామం పోలింగ్ బూత్ 251లో ఈవీఎంలను సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్వయంగా ధ్వంసం చేసిన విషయం తెల్సిందే. ఇపుడు ఆయన అనుచరుడు ఈవీఎంలను ధ్వంసం చేస్తున్న దృశ్యాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆయన అనుచరుడు పాలకీర్తి శ్రీనివాస రావు ఈవీఎంను ధ్వంసం చేస్తున్న వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఈవీఎంను ధ్వంసం చేసిన వ్యక్తిని పోలీసు అరెస్టు చేయకుండా తాపీగా బయటకు తీసుకెళ్లడం గమనార్హం. ఆ వీడియోను మీరు కూడా చూడండి. 

డియర్ కళ్యాణ్ బాబు... ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను... చిరంజీవి ట్వీట్
 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఓ ట్వీట్ చేశారు. "డియర్ కళ్యాణ్ బాబు.. ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో తెలిసిన నిన్ను, తగ్గావని ఎవరు అనుకున్నా అది ప్రజలని నెగ్గించటానికే అని నిరూపించిన నిన్ను చూస్తుంటే ఒక అన్నగా గర్వంగా వుంది. నువ్వు "గేమ్ ఛేంజర్"వి మాత్రమే కాదు, "మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్"వి కూడా అని అందరూ నిన్ను కొనియాడుతుంటే నా హృదయం ఉప్పొంగుతోంది!! నీ కృషి, నీ త్యాగం, నీ ధ్యేయం, నీ సత్యం జనం కోసమే! ఈ అద్భుతమైన ప్రజా తీర్పు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల సంక్షేమం కోసం, అలాగే నీ కలల్ని, నువ్వేర్పరుచుకున్న లక్ష్యాల్ని నిజం చేసే దిశలో నిన్ను నడిపిస్తాయని ఆకాంక్షిస్తూ, ఆశీర్వదిస్తూ, శుభాభినందనలు. నీవు ప్రారంభించే.. ఈ కొత్త అధ్యాయంలో నీకు శుభం కలగాలని, విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను" అని పేర్కొన్నారు. 
 
అలాగే, మరో ట్వీట్‌లో "ప్రియమైన చంద్రబాబు నాయుడు గారికి, చరిత్రలో అరుదైన విజయాన్ని అందుకున్న మీకు ముందుగా శుభాకాంక్షలు, అభినందనలు. ఈ మహత్తర విజయం, మీ మీద ప్రజలకు ఉన్న నమ్మకానికి, మీ నాయకత్వ పటిమకు, రాష్ట్రానికి గత వైభవం తిరిగి తేగలిగిన మీ దక్షతకు నిదర్శనం. రాజకీయ దురంధరులైన మీ మీద, పవన్ కల్యాణ్, నరేంద్ర మోడీ గారి మీద ప్రజలు కనపరచిన విశ్వాసాన్ని సంపూర్ణంగా నిలబెట్టుకొని, రాజధానిలేని, గాయపడిన రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెట్టి నెంబర్ వన్‌గా తీర్చిదిద్దుతారని ఆశిస్తున్నాను" అని పేర్కొన్నారు. 


 

సంబంధిత వార్తలు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments