Webdunia - Bharat's app for daily news and videos

Install App

అసెంబ్లీ : 'బాబు వస్తారు.. జాబు వస్తుంది' అని జగన్ అనగానే మైక్ కట్!!

Webdunia
శనివారం, 20 డిశెంబరు 2014 (13:29 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా శనివారం ఉదయం విపక్ష నేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ... "బాబు వస్తారు... జాబ్ వస్తుంది..." అంటుండగానే స్పీకర్ కోడెల ఆయన మైక్‌ను కట్ చేశారు. 
 
శనివారం నాటి సభలో వాయిదా తీర్మానంపై చర్చకు అనుమతించాలంటూ వైఎస్సార్సీపీ సభ్యుల ఆందోళన నేపథ్యంలో జగన్‌కు మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఆయన ప్రసంగిస్తూ, అధికారంలోకి వచ్చాక ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. 
 
ఐకేపీ, అంగన్ వాడీ, కాంట్రాక్ట్ ఉద్యోగులు నాలుగు రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న విషయాన్ని వైఎస్ జగన్ ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా, ఎన్నికల సమయంలో తెలుగుదేశం ఇచ్చిన హామీలను ప్రస్తావించబోతే స్పీకర్ అడ్డుకోవడం గమనార్హం. 
 
స్పీకర్ వ్యవహారశైలిపై విపక్ష సభ్యులు మండిపడుతున్నారు. కోడెల శివప్రసాద్ సభాపతిగా కాకుండా, టీడీపీ సభ్యుడిగా నడుచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే స్పీకర్‌పై సభా హక్కుల నోటీసు ఇస్తామని వారు హెచ్చరించారు. 

పాయల్ రాజ్‌ పుత్‌తో ప్రభాస్ పెళ్లి.. డార్లింగ్‌గా ఉంటాను?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

Show comments